నిధుల వేటలో సీఎం బిజీ

20151026232152ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఫుల్ బిజీ. హస్తినా టూర్ ఎజెండా వేరైనా..నిధుల కోసం కేంద్రమంత్రులను కలిశారు. సమస్యలు విన్నవిస్తూనే…పరిష్కారాలు వెతికారు ముఖ్యమంత్రి. ప్రధానంగా FRBM రుణపరిమితి  పెంపుపైనే..ఫోకస్ పెట్టారు కేసీఆర్. పనిలో పనిగా నేషనల్ హైవేస్ విస్తరణపై కూడా నజర్ పెట్టారు ముఖ్యమంత్రి. జైట్లీ, గడ్కరీతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్.

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సాయం కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్. అభివృద్ధిపై చర్చిస్తూనే..నిధుల కోసం రిక్వెస్టులు చేశారు సీఎం. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రోడ్డు రవాణా.. జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో వేర్వేరుగా ముఖ్యమంత్రి  సమావేశమయ్యారు.  FRBM రుణపరిమితి పెంపుపై అరుణ్ జైట్లీతో చర్చించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి, రాష్ట్ర పథకాలకు నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా నిధులు పెంచాలని సీఎం కేసీఆర్ జైట్లీకి విజ్ఞప్తి చేసినట్టు ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి చెప్పారు.

కేసీఆర్ రిక్వెస్ట్ కు రియాక్ట్ అయ్యారు అరుణ్ జైట్లీ. రుణ పరిమితి పెంచడంపై చర్చిస్తున్నామని చెప్పారు . నోట్ ను ఆర్థికశాఖ వినిమయ విభాగానికి పంపామని తెలిపారు. రాష్ట్రంలోని జాతీయ రహాదారుల విస్తరణపై నితిన్ గడ్కరీతో మీట్ అయ్యారు కేసీఆర్.  రాష్ట్రంలో 4వేల కిలోమీటర్ల రహదారులు అవసరమని గడ్కరీకి రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన రోడ్ల విస్తరణ జరగలేదని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డ్రైపోర్టు, అన్ని జిల్లాల్లో జాతీయ రహదారుల విస్తరణ జరిగేలా చూడాలని కేసీఆర్ కోరారు. 13 వందల కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి త్వరలోనే గెజిట్ విడుదల చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్టు ఎంపీ వినోద్ కుమార్ చెప్పారు.. కేంద్రమంత్రులతో సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు సీఎస్ రాజీవ్ శర్మ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, విశ్వేశ్వర్ రెడ్డి,  రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్రుడు పాల్గొన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy