నిన్న సల్మాన్.. ఇవాళ మిథున్..!!

18_06_2014-Mithun18బాలీవుడ్ కు టైం బాగున్నట్టు లేదు. చాలా మంది స్టార్లు ఏదో ఒక విధంగా… క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నటిదాకా సల్మాన్ ఖాన్ వ్యవహారం దేశంలో మరిచిపోకముందే .. ఇప్పుడు మిథున్ చక్రవర్తి వంతు వచ్చింది. బాలీవుడ్ స్టార్,  తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తిని ఈ మధ్యే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ స్కామ్ కేసులో చక్రవర్తిని ఈడీ ప్రశ్నించింది. ఈడీ అధికారులు మిథున్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. తనకు ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేస్తానని… ఈడీ అధికారులకు మిథున్ చెప్పినట్టు తెలుస్తోంది.

శారదా గ్రూప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు మిథున్ చక్రవర్తి. ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలో అనేక డీవీడీలు, సీడీలు, ఇతర పత్రాలు ఇచ్చినట్టు సమాచారం. శారదా గ్రూప్ తో తన సంబంధాలన్నీ పూర్తిగా వృతిపరమైనవనీ చెప్పినట్టు తెలుస్తోంది. ఎవరినీ చీట్ చేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారాయన. ఎలాంటి కుంభకోణాలతోనూ తనకు సంబంధం లేదని తన పర్సనల్, అఫీషియల్ రికార్డులన్నింటిని ఈడీ అఫీషియల్స్ కి ఇచ్చినట్టు సమాచారం. కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ప్రకారమే తాను శారదా గ్రూప్ ప్రమోషనల్ వీడియోలు, అడ్వర్టైజ్ మెంట్లలో నటించినట్టు మిథున్ చెప్పారు. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని ఈడీకి హామీనిచ్చినట్టు తెలుస్తోంది. మిథున్ స్టేట్ మెంట్స్ ఈడీ రికార్డు చేసుకుంది. ఆయన ఇచ్చిన సమాధానాలతో ఈడీ అధికారులు ఫుల్ శాటిసిఫై అయినట్టు తెలుస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy