నిప్పుల కుంపటి: రాష్ట్రంలో భగ..భగ

SUNరాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఎండలు,వడగాలులతో  జనం అల్లాడిపోతున్నారు.  ఉదయం 10 గంటలకే 40 డిగ్రీల ఎండ నమోదవుతోంది. దీంతో ఇళ్లలో నుండి జనం బయటకు రావాలంటనే భయపడిపోతున్నరు. ఇంకో రెండు రోజులు ఎండలు ఇలానే ఉంటాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు. సాధారణంగా ఉండే శాతం కంటే 5 డిగ్రీల వరకు ఎండలు పెరుగుతాయని, వడగాలులు ఉంటాయని చెప్తున్నారు.

ఇక ఇయ్యాల  పెద్దపల్లి జిల్లాల్లో ఎక్కువగా 45 డిగ్రీల ఎండ నమోదైంది. మంచిర్యాలలో 43 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెంలో 42, కరీంనగర్, కోమ్రుం భీం అసిఫాబాద్ జిల్లాలలో 41 డిగ్రీల ఎండ ఉంది. జనగాం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్లో 40 డిగ్రీల ఎండ నమోదైంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. బయటకు వెళ్లిన ప్రజలు.. జ్యూస్ లు, కొబ్బరి బొండాలు తాగుతూ గొంతు తడుపుకుంటున్నారు. అత్యవసర పనులుంటేనే బయటకు వెళ్లమని డాక్టర్లు సూచించారు. అలానే బయటకు వెళ్లేటప్పుడు చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy