నిమ్స్ లో అరుదైన హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్

nimsనిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్…. పేద, మధ్యతరగతి ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్న ఆస్పత్రి ఇది. నిత్యం వివిధ రకాల అనారోగ్య సమస్యలతో వందలాదిమంది ఇక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటారు. రేర్ సర్జరీలు చేస్తున్నా.. చెప్పుకోదగ్గ ఆపరేషన్లు చేయడంలో ఆస్పత్రి సిబ్బంది విఫలమవుతున్నారు. ఇది గమనించిన ప్రభుత్వం ఇటీవల పలుమార్పులకు శ్రీకారం చుట్టడంతో సిబ్బందికి బూస్ట్ ఇచ్చినట్టైంది. ఇదే క్రమంలో కొత్తగా వచ్చిన డైరెక్టర్ మనోహర్ సైతం వైద్యులను బాగా ఎంకరేజ్ చేస్తుండటంతో ఆస్పత్రి ఎన్నోప్రయోగాలకు వేదికౌతోంది. ఇటీవలే రెండు లివర్ మార్పిడి శస్త్రచికిత్సలు చేసి, గ్రేట్ అనిపించుకున్నవైద్యులు, తాజాగా.. 30 ఏళ్ల ఓమలతకు గుండెమార్పిడి శస్రచికిత్సను సక్సెస్ ఫుల్ గా చేశారు. అంతేకాదు కార్పోరేట్ ఆస్పత్రిలో అయ్యేఖర్చులో పావులొంతులోనే జరపడం విశేషం. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే ఆమెకు ట్రాన్స్ ప్లాంట్ చేయడమేగాక, కోలుకునేవరకు ఆస్పత్రిలో స్పెషల్ రూంలో ఉంచి కేర్ తీసుకుంటున్నారు. నిమ్స్ వైద్యులపై పలు విమర్శలున్నాయి. ఇక్కడ ఎయిమ్స్ తరహా రీసెర్చ్ చేసే విజ్ఞానం కలిగిన వైద్యులు ఉన్నా… నైపుణ్యత ప్రదర్శించడంలో విఫలమౌతున్నారని విమర్శలున్నాయి. మరోవైపు ఎన్నోఏళ్లుగా స్టాఫ్ రిక్రూట్ మెంట్ లేకపోవడం, ఎక్విప్ మెంట్ కొరత ఉంది. అయితే తాజాగా.. ప్రభుత్వం నుంచి నిమ్స్ కు అన్నిరకాల సహకారం అందడం, కొత్త డైరెక్టర్ ను నియమించి స్వేఛ్చ కల్పించడంతో మెరుగైన ఫలితాలకు శ్రీకారం చుడుతున్నారు వైద్యులు. ఆస్పత్రి అభివృద్ధిలో భాగంగా మరో ఎంఆర్ఐ, సిటిస్కాన్ మిషన్ తెప్పించగా, కీలకమైన బోన్ మ్యారో బ్యాంకు ఏర్పాటుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ బెడ్స్ పెంచడం, క్రిటికల్ ఆపరేషన్ చేసినప్పుడు పూర్తిగా కోలుకోనేవరకు మందులు సైతం ఉచితంగా ఇప్పిస్తున్నారు. ఇందుకు పదేళ్ల తర్వాత కిడ్నీట్రాన్స్ ప్లాంట్స్, లివర్ ట్రాన్స్ ప్లాంట్స్, ఇప్పుడు ఈ హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్. పేదలకు పైసా ఖర్చు లేకుండా పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు వైద్యం చేయించుకున్న వారు. చాలా కాలం తర్వాత నిమ్స్ లో అందుతున్నవైద్యం, ఎంతోమంది పేషంట్లలో వెలుగులు నింపుతుండగా, ప్రభుత్వసహాకారం పూర్తి స్థాయిలో లభిస్తే పూర్వవైభవం రావడం ఖాయమంటున్నారు వైద్యులు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy