నిరసనగానే కిరణ్ రాజీనామా

 • kiran-kumar-reddyరాష్ట్ర విభజనకు నిరసనగానే రాజీనామా చేస్తున్నట్టు కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
 • సీట్లకోసం, ఓట్ల కోసం రాష్ట్రాన్ని విభజించడం అన్యాయమన్నారు కిరణ్.
 • విభజన వల్ల తెలుగుప్రజలందరికీ నష్టమని కిరణ్ చెప్పారు.
 • తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, సొంత పార్టీ కాంగ్రెస్ కూడా విభజనకు సహకరించాయని కిరణ్ విమర్శించారు.
 • రెండురాష్ట్రాలలో జనం తాగునీటికీ, సాగునీటికీ, కరెంటుకూ ఇబ్బంది పడతారని కిరణ్ అన్నారు. ఉపాధి విషయంలోనూ, చదువు విషయంలోనూ కూడా రెండుప్రాంతాల ప్రజలు నష్టపోతారని చెప్పారు.
 • పార్లమెంటులో తెలుగు ఎంపీలను కొట్టించారన్నారు కిరణ్.
 • రాష్ట్ర  అసెంబ్లీ ‘నో’ అన్న బిల్లును లోక్ సభ ఆమోదించడం ఏమిటని ఎద్దేవా చేశారు కిరణ్.
 • రాష్ట్రానికి చెందినవారిని సస్పెండ్ చేసి, ఏకపక్షంగా బిల్లును ఆమోదించడం అన్యాయమన్నారు.
 • కాంగ్రెస్ , బీజేపీ కుమ్మక్కయ్యి, బిల్లును గట్టెక్కించాయని కిరణ్ చెప్పారు.
 • ‘లోక్ సభలో గొడవకే ప్రధానమంత్రి మనసు గాయపడిందట. ఈ విభజనతో తెలుగు ప్రజల మనసులు ఎలా గాయపడ్డాయో ప్రధానికి తెలుసా?’ అని కిరణ్ ప్రశ్నించారు.
 • పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వర్థిల్లే మన దేశంలో అందరూ నవ్వుకునే విధంగా బిల్లును ఆమోదించారన్నారు కిరణ్.
 • తెలుగు ప్రజలను కాపాడలేకపోయినందుకు బాధతో వైదొలుగున్నానని కిరణ్ చెప్పారు.
 • ఎవరి మనసైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారాయన.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy