నిరసనలో హోరెత్తిన హెచ్ సీయూ

HCU students-protestరోహిత్ ఆత్మహత్యపై ఆందోళనకు జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తుండడంతో.. HCU విద్యార్థులు నిరసనను పెంచుతున్నారు. విషాదానికి వీసీతో పాటు.. కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలే కారణమని మొదటి నుంచీ చెబుతున్న విద్యార్థులు.. వారు రాజీనామా చేసే వరకూ ఆందోళన ఆపేది లేదన్నారు. వందల సంఖ్యలో విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు ఉదయం నుంచీ వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం ముందే.. ప్లకార్డులతో ఆందోళన చేశారు. వర్సిటీ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని విద్యార్థులు  ప్రశ్నిస్తున్నారు. కమిటీల పేరుతో కేంద్రం చేతులు దులుపుకొంటోందని విమర్శించారు. వీసీ అప్పారావుతో పాటు.. కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ కు క్యాంపస్ లోని షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు.. విద్యార్థులు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 5 కోట్ల రూపాయల పరిహారంతో పాటు.. రోహిత్ కుటుంబంలో ఒకరికి యూనివర్సిటీలో ఉద్యోగం కల్పించాలన్నారు. ఇక.. రోహిత్ ఆత్మహత్యకు కారణాలు తేల్చేందుకు… కేంద్రం అపాయింట్ చేసిన ద్విసభ్య కమిటీ.. యూనివర్సిటీలో పర్యటించింది. విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించింది. అయితే.. కమిటీ పర్యటనపైనా విద్యార్థులు నిరసన తెలిపారు. గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులతో మాట్లాడేందుకు HCU కు వెళ్లిన బీజేపీ నేతలను.. విద్యార్థులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లారు.రోహిత్ ఆత్మహత్యపై విద్యార్థుల డిమాండ్లకు.. నాయకులు అండగా నిలుస్తున్నారు. ఈ విషాదంపై సమగ్రంగా విచారణ జరిపించాలంటూ.. HRC ని ఆశ్రయించారు.. ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి. ఇందుకు స్పందించిన కమిషన్.. ఫిబ్రవరి 1లోగా నివేదిక ఇవ్వాలని వర్సిటీ వీసీతో పాటు.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ను ఆదేశించింది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy