నిరసనల మధ్యే రాజ్ నాథ్ పాక్ టూర్

rajnathభారత హోమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి పాకిస్తాన్ లో అడుగుపెట్టారు రాజ్ నాథ్ సింగ్. తొలిసారి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన రాజ్ నాథ్… సార్క్ దేశాల అంతర్గత వ్యవహారాల మంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో… సీమాంతర ఉగ్రవాదంపై రాజ్ నాథ్ ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశముంది. ఎయిర్ పోర్టులో రాజ్ నాథ్ కు భారత ఎంబసీ అధికారులు, పాకిస్తాన్ అధికారులు స్వాగతం పలికారు. తర్వాత… పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అదనపు కార్యదర్శితో సమావేశమయ్యారు. ఇద్దరి మధ్యా కొద్దిసేపు చర్చలు సాగాయి.

హోంమంత్రుల సమావేశంలో… మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం గురించి రాజ్ నాథ్ ప్రస్తావించే అవకాశముంది. దీంతో పాటు సీమాంతర ఉగ్రవాదాన్ని కూడా రాజ్ నాథ్ సింగ్ లేవనెత్తుతారని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. హోంశాఖ అధికారులతో, విదేశాంగ శాఖ అధికారులు కూడా రాజ్ నాథ్ వెంట వెళ్లారు. ఆర్గనైజ్డ్ క్రైమ్, టెర్రరిజం కు వ్యతిరేకంగా అర్థవంతమైన ప్రాంతీయ సహకారం కోసం ఎదురుచూస్తున్నట్టు ఇస్లామాబాద్ వెళ్లేముందు రాజ్ నాథ్ ట్వీట్ చేశారు

ఇస్లామాబాద్ లో రాజ్ నాథ్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థ నాయకుడు సయ్యద్ సల్లావుద్దీన్ ఆందోళనలకు నాయకత్వం వహించారు. దాదాపు 2వేల మంది జిహాదీలు… కాన్ఫరెన్స్ వేదిక దగ్గర నిరసన ప్రదర్శన చేపట్టారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండ్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ కు, కశ్మీరీల ఆందోళనలకు రాజ్ నాథ్ దే బాధ్యత అని ఆరోపించారు సల్లావుద్దీన్.

పాకిస్తాన్ లో భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలన్నీ… రాజ్ నాథ్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. కశ్మీర్ లో ఆందోళనల వెనక పాకిస్తాన్ హ్యాండ్ ఉందని రాజ్ నాథ్ గతంలోనే ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో రేపు జరిగే హోంమంత్రుల కాన్ఫరెన్స్ లో ఆయన ఏఏ అంశాలు ప్రస్తావిస్తారన్న విషయం ఆసక్తిగా మారింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy