నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : 2 వేల PO పోస్టులకు SBI నోటిఫికేషన్

sbనిరుద్యోగులకు శుభవార్త.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) లో 2 వేల ప్రొబెషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫైనలియర్ చదివే విద్యార్ధులు కూడా అప్లయి చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లయి చేసేవాళ్ల వయస్సు 2018 ఏప్రిల్-1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. ఆర్హులైన అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది. అప్లయి చేయడానికి చివరి తేదీ మే 13, 2018. ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామ్, తర్వాత మెయిన్ ఎగ్జామ్, చివరిగా గ్రూప్ ఎక్సర్ సైజ్, ఇంటర్వ్యూ  ఆధారంగా ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy