నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

VaralakshmiFoundationనిరుద్యోగ యువతకు శుభవార్త. ఉచిత శిక్షణతో పాటు  ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది  ప్రముఖ విమానాశ్రయ, జాతీయ రహదారి నిర్వహణ సంస్థ జీఎంఆర్. శంషాబాద్ పరిధిలోని ఎయిర్‌పోర్టు క్యాం పస్‌లో ఉన్న జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ శిక్షణ కేంద్రంలో ఈ నెల 15న ఉదయం 10 గంటలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ, ఇంటర్, డిప్లామా, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులని వివరించారు. సుమారు 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చిన  తర్వాత అర్హతను బట్టి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నట్టు తెలిపారు. నిరుద్యోగ యువతీ, యవకులు ఈ సదవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. మరిన్ని వివరాలకు 8790844288 ఫోన్ నెంబర్‌లలో సం ప్రదించవచ్చని పేర్కొన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy