నిర్ణీత సమయానికే ఎన్నికలు : కేసీఆర్

cmkcrtextilepark1గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్ణీత సమయానికే నిర్వహిస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన సందర్భంగా ఆదివారం( అక్టోబర్-22) వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం.. ఈ విషయాన్ని ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చెప్పిన మాట ప్రకారం.. లంబాడీ, ఆదివాసీ తండాలను, గూడెంలను పంచాయతీలుగా మార్చబోతున్నామన్నారు.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడుతున్నామని.. 4 వేల నుంచి 5 వేల వరకు కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. గ్రామాల వికాసం కోసం రాబోయే బడ్జెట్‌లో రూ. 2 వేల నుంచి 3 వేల కోట్లు కేటాయించబోతున్నామన్న కేసఈర్.. జనాభా ప్రాతిపదికన గ్రామాలకు అభివృద్ధి కోసం రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు నిధులు ఇస్తామని చెప్పారు. బాధ్యతాయుతమైన పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy