నిర్భయ అసలు పేరు ‘జ్యోతి సింగ్’

nirbhaya-storyమూడేళ్ల క్రితం యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది నిర్భయ ఘటన. డిసెంబర్ 16న 2012లో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు తలచుకున్నా ఒళ్లు జలదరింప చేస్తుంది. అమ్మాయి బయటకు వెళితే మానవ మృగాలు ఎంత బరితెగిస్తాయో అందరికీ గుర్తు చేసిన ఘటన అది. ఆ ఘటనలో చనిపోయి… ఇప్పటికీ ఎంతో మంది గుండెల్లో మార్మోగుతున్న పేరు నిర్భయ. అసలు పేరు అదికాకున్నా.. ఆ పేరుతోనే అందరికీ గుర్తుండిపోయింది. కొన్ని కారణాల రిత్యా అప్పుడు పేరు బయటపెట్టలేదు. కానీ మూడేళ్ల తర్వాత ఆమె తల్లి బుధవారం బహిరంగంగా ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన ఓ మీటింగ్ లో మాట్లాడుతూ నిర్భయ తల్లి ఆశాదేవి తన కూతురిపేరు జ్యోతి సింగ్ అని తెలిపింది. “నా కూతురి పేరు చెప్పడానికి నేను సిగ్గుపడటం లేదు.. కానీ ఆ కేసులో శిక్ష అనుభవిస్తున్న నేరస్థుడిని చిన్న పిల్లాడు అంటూ రిలీజ్ చేయడం ఎంత వరకు సమంజసం” అని ప్రశ్నించింది.

nirbhaya-mother

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy