నిర్భయ కేసులో బాల నేరస్తుడికి ఊరట

Juvenile-delhiమూడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన  నిర్భయ రేప్  కేసులో జువైనల్ నేరస్తుడికి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ జరిగిన వాదనలు సందర్భంగా జువైనల్ నేరస్తుడి విడుదల నిలుపుదలపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జువైనల్ నేరస్తుడి విడుదలను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది.  దీంతో జువైనల్ నేరస్తుడు ఈ నెల 20న విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.  మరోవైపు నిర్భయ కేసులో తమకు న్యాయం జరగలేదని నిర్భయం తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy