నిర్భయ నిందితుడిని వదిలిపెట్టేస్తారా..?

nirbhaya not freedదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో బాలనేరస్తుడి విడుదల ఇష్యూ ఇప్పుడు వివాదంగా మారింది. రిలీజ్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి పిల్  దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు… జువెనైల్ రిలీజ్ పై… తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

బాలనేరస్తుడి రిలీజ్ చేయాలన్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మూడేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న బాల నేరస్థుడి పరివర్తన వచ్చి ఉంటుందని… ఇపుడు మేజర్ అయ్యాడు కాబట్టి.. సమాజంలో తిరిగేలా అనుమతివ్వాలని జువెనైల్ జస్టిస్ బోర్డు సూచించింది. సత్ప్రవర్తనను పరిగణలోకి తీసుకుని సెక్షన్ 107 కింద రిలీజ్ చేయాలని సూచించింది. 2012 డిసెంబర్ 16న జరిగిన నిర్భయ ఘటనలో… బాల నేరస్తుడి శిక్షాకాలం ముగియడంతో విడుదల అయ్యే అవకాశాలున్నాయనుకున్నారంతా.  జువైనల్ జస్టిస్ బోర్డు సూచనను బీజేపీ లీడర్ సుబ్రమణియన్ స్వామి వ్యతిరేకించారు. రికార్డ్స్ ప్రకారం డిసెంబర్ 20న నేరస్తుడిని రిలీజ్ చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. అప్పటి వరకు రిలీజ్ ఆర్డర్ పోస్ట్ పోన్ చేయాలని కోరారు. అటు నిర్భయ పేరెంట్స్ కూడా బాలనేరస్తుడి విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అతని వల్ల తమకు ప్రాణహాని ఉందంటున్నారు. బాలనేరస్తుడికి శిక్షపై 2013లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుబ్రమణియన్. అయితే 18 సంవత్సరాల లోపు వయసున్న వారిని  బాల నేరస్తుడిగానే పరిగణిచాల్సిం ఉందన్న కోర్టు ఆ పిటిషన్ ను కొట్టి వేసింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy