నిర్లక్ష్యం : కంపుకొడుతున్న చెరువులు

Alamగ్రేటర్ హైదరాబాద్ చెరువులు కాలుష్య కేంద్రాలుగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో వందల ఏళ్ల చరిత్ర ఉన్న చెరువులు కంపుకొడుతున్నాయి. ఆహ్లాదాన్ని పంచే సిటీ లేక్స్.. ఇప్పుడు దోమలకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. వ్యర్థాలతో కలుషితమైన చెరువులతో.. సిటీ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువు చుట్టు పక్క ప్రాంతాల్లోనే అపార్ట్ మెంట్లు, విల్లాలు రావడం.. వాటికి సంబంధించిన డ్రైనేజ్ పైపులైన్లు నేరుగా చెరువులోకి వదిలేయడంతో.. వ్యర్ధాలు చెరువుల్లో కలుస్తున్నాయి. దీంతో ఎంతో శుద్ధిగా ఉన్న చెర్వునీళ్లు.. కలుషితమవుతున్నాయి.

ఇబ్రహీంచెరువులో చెత్త

మీరు చూస్తున్నది ఇబ్రహీం చెర్వు. లంగర్ హౌజ్ డివిజన్లోని ఇబ్రహీం బాగ్ లో ఉంది. గతంలో ఈ చెర్వు ఇక్కడి ప్రజలకు సాగు, తాగు నీటికి ఎంతగానో ఉపయోగపడేది. అన్ని కుల వృత్తులకు అండగా వుంది. నిత్యం ఆహ్లాదాన్ని పంచే ఇబ్రహీం చెర్వు.. ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కొన్నేళ్లుగా ఈ చెరువులో మురుగునీరు వచ్చి చేరడంతో.. రూపురేఖలే మారిపోయాయి. నిండా గుర్రపు డెక్కతో నిండిపోయింది. దర్వాసనకు చుట్టుపక్కలకు రావాలంటేనే భయపడుతున్నారు జనం.

ఇబ్రహీం చెరువుపైన వుండే.. దుర్గం చెర్వుతోపాటు మరో రెండు చెరువుల మురుగునీరు సైతం దీంట్లోకి వచ్చి చేరుతుండటంతో.. ఇబ్రహీం చెరువులో మురుగు నీరు పెరుకుపోయింది. దోమలు పెరిగాయి. భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.

ఈ పరిస్థితి సిటీలోని ఈ ఒక్క చెరువుకే లేదు. గ్రేటర్ లో ఉన్న 160కి పైగా చెరువుల్లో వుంది. ఇందులో కొన్ని కబ్జాకు గురైతే.. మరికొన్ని మురుగునీటితో కలుషితమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో మంచినీటి చెర్వులుగా ఉన్న చెర్వులన్ని వ్యర్ధాలతో నిండిపోతున్నాయి. ఇప్పటికే సిటీలో చాలా చెరువులు కబ్జా అయ్యాయంటోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటోంది.

20ఏళ్లుగా కబ్జాలో..

20 ఏళ్లుగా సిటీలోని చాలా చెరువులు కబ్జాకు గురవుతున్నా.. పట్టించుకునే వారే లేరు. GHMC, HMDA, వాటర్ బోర్డ్ శాఖల మధ్య సమన్వయ లోపంతో చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. డ్రైనేజ్ పైపులైన్లు ఏర్పాటు చేయడంలో వాటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం చేస్తే.. చెరువుల్లో పెరిగే గుర్రపు డెక్కను తొలగించడంలో.. జీహెచ్ఎంసీ అధికారులు విఫలమవుతున్నారు. మరో వైపు చెరువులను సుందరీకరించాల్సిన హెచ్ఎండీఏ అధికారులు.. లైట్ తీసుకోవడంతో.. సిటీ లేక్స్ మనుగడ  ప్రశ్నార్ధకం మవుతోందంటున్నారు సిటిజన్స్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy