నిలిచిపోయిన కేశినేని సర్వీసులు

kesineniతెలుగు రాష్ట్రాలతో పాటు… తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సర్వీసులు అందిస్తున్న కేశినేని ట్రావెల్స్ సర్వీసులు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి బస్సులు తిరగడం లేదు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆ ట్రావెల్స్ కార్యాలయాన్ని మూతపడ్డాయి. కేశినేని ట్రావెల్స్‌ను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ యజమాని కేశినేని నాని ప్రకటించారు. దీంతో 170 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. గత వారం రోజుల నుంచి అడ్వాన్స్ బుకింగ్‌ను కూడా నిలిపేశారు.

ఏపీ రవాణాశాఖ కమిషనర్ సుబ్రమణ్యంతో గొడవే ఈ మూసివేతకు కారణమని చెబుతున్నారు. ఆర్టీఏ అధికారులపై దాడి నేపథ్యంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు నాని. ఈ సందర్భంగా నానితో రవాణా శాఖ కమినర్‌కు చంద్రబాబు క్షమాపణలు చెప్పించారు. ఈ విషయంలో కేశినేని తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆ కారణంగానే ట్రావెల్స్‌ను మూసేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు కోరినా.. తాను మాత్రం మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు నాని.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy