నిలువునా గడ్డకట్టిపోతున్నారు : చలికి థర్మామీటర్లు పగిలిపోయాయి

jh

జీరో డిగ్రీలు అంటే వణికిపోతాం.. మైనస్ 10 అంటే అమ్మో అంటాం.. అదే మైనస్ 20 అంటే మాటలు రావు.. అదే మైనస్ 62 డిగ్రీల టెంపరేచర్ అంటే వినటానికే షాకింగ్ గా ఉంది కదా.. ఇప్పుడు వాస్తవం అయ్యింది. రష్యా దేశంలోని యకుటియా ఏరియా అనే ప్రాంతం ఉంది. మాస్కోకి తూర్పుదిశగా 5,300కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ 10 లక్షల మంది జీవిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడూ మైనస్ డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. మైనస్ 20 డిగ్రీలు అనేది ఇక్కడ కామన్. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా మైనస్ 67 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. నీళ్లు అనేవే లేవు ఇక్కడ. అంతా మంచుతో కప్పబడింది. బయటకు వస్తే నిలువునా గడ్డకట్టుకుపోతున్నారు జనం.

సైబీరియాలోని ఓమ్యాకాన్ అనే ప్రాంతం భూమ్మీదే అత్యధిక మైనస్ డిగ్రీలు నమోదైన ప్రాంతంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 500 మంది నివసించే ఈ ప్రాంతంలో చలికి ధర్మామీటర్ కూడా పగిలిపోయింది. టెంపరేచర్ రీడింగ్ తెలిపే ఈ ధర్మామీటర్ ప్రజలకు రోజూవారీ టెంపరేచర్ వివరాలు అందిస్తోంది. మైనస్ 67 డిగ్రీల దగ్గర ఇది పగిలిపోవటంతో ప్రజలు కూడా షాక్ అయ్యారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో చలికి ఇద్దరు చనిపోయారు. చలిలో కనుబొమ్మలు కూడా మంచుతో కప్పేసిన ఫొటోలను అన్నాస్టాషియాగవ్ అనే అమ్మాయి సోషల్ మీడియా ద్వారా తెలియజేయటంతో విషయం బయట ప్రపంచానికి తెలిసింది. మొదటిసారి ఇక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. యకుటియా ప్రాంతంలో 2013లో మైనస్ 71 డిగ్రీలు నమోదు అయ్యింది చెబుతున్నారు అధికారులు. ఆ తర్వాత ఇదే అంటున్నారు. మైనస్ 71 డిగ్రీలు అనేది ఓ ప్రాంతానికే పరిమితం అయ్యిందని.. ఇప్పుడు యకుటియా, సైబీరియా ప్రాంతం మొత్తం మైనస్ 67 డిగ్రీలు నమోదు అవుతుందని చెబుతున్నారు.
6232

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy