నిల్చొనే బిడ్డను కనేసిన తల్లి..

36E7349A00000578-0-image-a-65_1470396842843కాన్పు కోసం హాస్పిటల్ కు వచ్చారు ఆ దంపతులు. నొప్పులు మెల్ల మెల్లగా పెరుగుతుండటంతో కాస్త ముందుగానే హాస్పిటల్ కు చేరుకున్నారు. కార్ పార్క్ చేయడానికి పార్కింగ్ ప్లేస్ కు వెళ్లాడు ఆ భర్త. ఇలా వెళ్లాడోలేదో… ఎంట్రన్స్ లో అడుగుపెడుతున్న భార్య ఒక్కసారిగా ప్రసవించింది. తన కాన్పు తనే అన్నట్టు… నిల్చునే పండంటి ఆడబిడ్డను కనేసింది ఆ తల్లి. ఈ ఘటన బ్రిటన్ లో స్కన్ తోర్ప్ జనరల్ హాస్పిటల్ ఎదురుగానే జరిగింది. ఆడబిడ్డకు జన్మనివ్వడంపై ఆ దంపతులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy