నిషేధం ఓ చెత్త నిర్ణయం : బోర్డుపై శ్రీశాంత్‌ ఫైర్

sreesanthBCCIకి అనుకూలంగా తీర్పు రావడంపై శ్రీశాంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్విట్టర్‌ వేదికగా బోర్డుపై నిప్పులు చెరిగాడు. ‘నిషేధం ఓ చెత్త నిర్ణయం. తన కోసమే అన్నట్లుగా ఉంది ఈ నిబంధన. మరి అసలు దోషుల సంగతేంటని ప్రశ్నించాడు. చెన్నై సూపర్‌ కింగ్స్, రాజస్తాన్‌ రాయల్స్‌లపై నిషేధం విధించరా.. లోధా నివేదికలోని 13 మంది నిందితులపై ఏ నిర్ణయం తీసుకుంటారని విమర్శించాడు. ఇది ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదా అని ట్విట్టర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు శ్రీశాంత్.

ఏదేమైనా తన న్యాయపోరాటం కొనసాగుతుందని చెప్పిన ఆయన.. మద్దతు తెలిపిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన పేస్‌ బౌలర్‌ శ్రీశాంత్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) విధించిన నిషేధం కొనసాగుతుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2013–IPLలో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో నిందితుడైన 34 ఏళ్ల శ్రీశాంత్‌ బోర్డు నిషేధాన్ని కోర్టులో సవాలు చేశాడు. ఆగస్టు 7న సింగిల్‌ జడ్జి బెంచ్‌ అతడిని నిర్దోషిగా తేల్చింది. అయితే దీనిపై BCCI హైకోర్టుకు వెళ్లింది.

మంగళవారం(అక్టోబర్-17) ఈ కేసును చీఫ్‌ జస్టిస్‌ నవనీతి ప్రసాద్‌ సింగ్, జస్టిస్‌ రాజా విజయరాఘవన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టివేసి, నిషేధాన్ని కొనసాగిస్తూ BCCIకి అనుకూలంగా తీర్పునిచ్చింది. అతనిపై క్రిమినల్‌ కేసుల్ని దిగువ కోర్టు తోసిపుచ్చినప్పటికీ దాని ప్రభావం తాము విధించిన నిషేధంపై ఉండదని BCCI వాదించింది. ఫిక్సింగ్‌పై గట్టి ఆధారాలు లభించడంతోనే బోర్డు మధ్యంతర కమిటీ శ్రీశాంత్‌పై నిషేధం విధించిందని కోర్టుకు తెలిపింది. అయితే కేరళ క్రికెట్‌ సంఘం కార్యదర్శి జయేశ్‌ మాట్లాడుతూ శ్రీశాంత్‌కు అండగా నిలవాలనుకున్నప్పటికీ కోర్టు తీర్పే శిరోధార్యమని అన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy