‘నీచ్ ఆద్మీ’ ఎఫెక్ట్ : మణిశంకర్ ను సస్సెండ్ చేసిన కాంగ్రెస్

mani-shankar-aiyar_650x400_61512647401సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ కు కాంగ్రెస్‌ పార్టీ భారీ షాక్‌ ఇచ్చింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు గురువారం (డిసెంబర్-7) రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన్ని ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేయటంతోపాటు, ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. మణిశంకర్‌ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని అయ్యర్‌ పై విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ కీలక నేతలు ఒక్కోక్కరుగా మణిశంకర్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థామయిలో మండిపడ్డారు కూడా. చివరకు ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించటంతో దిగొచ్చిన మణిశంకర్ అయ్యర్ కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

2014 లో న‌రేంద్ర మోడీని ‘చాయ్‌వాలా’ అంటూ హేళన ఆయన.. తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ఆశ‌యాల‌కు వాస్తవ రూపం తేవడానికి జవహ‌ర్‌లాల్‌ నెహ్రూ కృషి చేశార‌ని, అటువంటి కుటుంబంపై ప్ర‌ధాని మోడీ అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అన్నారు. ఆయ‌న‌ ‘నీచ్ ఆద్మీ’, నీచుడు, సభ్యత లేనివాడు అంటూ ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy