నీటి కింద నగరం

Lion-City3966233447
ఎప్పుడో ద్వాపర యుగం తర్వాత ద్వారక సముద్రం అడుగునకు వెళ్ళపోయిందని విన్నాము. కాని దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పటివరకు బయటపడలేదు. అయితే ఇలాంటి విషయమే చైనాలో బయటపడింది ఈ మధ్య. నీటి కింద భవనం ఒకటి చెక్కు చెదరకుండా బయటపడింది. దీంతో ఛైనా కు కొత్త టూరిస్ట్ స్పాట్ వచ్చింది… ఒకప్పుడు ఛైనాలో ఉండే జెజియాంగ్ లో ఆర్ధిక రాజకీయ కేంద్రం చాల రోజుల క్రితం చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది..అది కాస్తా ఇప్పుడు దాదాపు 50 ఏళ్ల తర్వాత ఆ లయన్ సిటీ భూగర్భంలో నీటి అడుగున చెక్కు చెదరకుండా దర్శనమిచ్చింది. 1959 లో ఛైనా లో హైడ్రోజన్ ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ నిర్మాణం జరిగింది. అప్పుడు పవర్ స్టేషన్ కు అనుగుణంగా ఛైనీయులు మానవ నిర్మిత సరస్సును తవ్వారు. అప్పుడే ఈ లయన్ సిటీ భూగర్భంలోకి కూలిపోయింది. చరిత్రలో కలిసిపోయిన ఈ లయన్ సిటీ గురించి అప్పుడు ఎవరు పట్టించుకోలేదు… కాని మొన్నీ మధ్య ఓ ట్రావెల్ కంపెనీ పెట్టిన స్విమ్మింగ్ కాంపీటీషన్ లో ఈ లయన్ సిటీ బయటపడింది.130 అడుగుల అడుగున ఈ సిటీ చెక్కు చెదరకుండా ఉండడంతో చైనా గవర్నమెంట్ నిధి దొరికినంత సంబరపడిపోయింది. 50 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఈ భవనాన్ని త్వరలోనే టూరిస్ట్ స్పాట్ గా మార్చాలని డిసైడ్ అయ్యింది.

నీటిలో సాహసాలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అలాంటిది నీటి అడుగున ఏకంగా టూరిస్ట్ స్పాటే ఉందంటే. దానికి ఎక్కడ లేనిక్రేజీ వచ్చేస్తుంది.  లయన్ సిటీ ని చూడడానికి నీటి మధ్య నుంచి వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. నీటి మధ్య నుంచి వెళ్తూ భవనం చూడడం కొత్త అనుభూతిని కలిగిస్తుందని భావిస్తున్నారు. టూరిస్టులూ ఎప్పుడెప్పుడూ ఇది రడి అవుతుందా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy