నీటి వినియోగంలో మార్పులేదు

krishna-waterగత రెండేళ్ళలాగానే ఈ ఏడాది కూడా కృష్ణా బేసిన్ లో నీటి వినియోగం ఉంటుందని తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది కేంద్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన బచావత్ ట్రీబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు, 299 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకోవాలని పేర్కొంది. నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖలు రాసినా ఏలాంటి సమాధానం లేకపోవడంతో బోర్డు సూచన మేరకు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సంయుక్త ప్రధాన కార్యదర్శి సంజయ్ కుందు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లకు లేఖలు రాశారు. కృష్ణా బేసిన్ లో నీటి వినియోగంపై మూడేళ్లుగా జరిగిన పరిణామాలివీ..

2015-16

..జూన్ 18,19 తేదీల్లో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించింది.

..బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు, 299 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

..811 టీఎంసీలకు మించి వచ్చినా,తగ్గినా ఇదే నిష్పత్తిలో వాడుకోవాలి.

..రెండు రాష్ట్రాలు తమకు కేటాయించిన నీటిని ఎక్కడైనా వాడుకోవచ్చు.

.ఎప్పుడు ఎంత నీటిని విడుదల చేయాలో రెండు రాష్ట్రాల  ఇంజనీరింగ్ చీఫ్ లు, బోర్డు సభ్య కార్యదర్శి కలిసి నిర్ణయం తీసుకుంటారు.

2016-17

ఈ నీటి సంవత్సరం ప్రారంభంలో డిల్లీలో మళ్లీ సమావేశం జరిగింది. 2015-16లో నీటి విడుదలలో తమకు ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవడం లేదా ఎవరి ప్రాంతంలోని ప్రాజెక్టులను విరే నిర్వహించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది.

.. సెప్టెంబర్ 21న అపెక్స్ కౌన్సల్ సమావేశమైంది. జలవనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. నీటి పంపిణీ, వినియోగానికి సంబంధించి 2015-16 లాగానే 2016-2017లో కూడా కొనసాగించేలా అంగీకారానికి వచ్చారు.

..రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అంశాలపై నీటి సంవత్సరం ముగిసేలోగా అధ్యయనం చేసి సిఫారస్ లు చేసేందుకు జలవనరుల మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. మూడు నెలల్లోగా నివేదిక వచ్చేలా చూస్తామని కేంద్రం చెప్పిన సాధ్యం కాలేదు. దీంతో కమిటీకి ఈ ఏడాది అక్టోబర్ వరకు గడువిచ్చింది కేంద్రం.

2017-2018

2017-2018 నీటి సంవత్సరం ప్రారంభమైనందున నీటి వినియోగానికి సంబంధించి అభిప్రాయం చెప్పాలని రెండు రాష్ట్రాలకు ఈ ఏడాది మే నెలలో బోర్డు లేఖలు రాసింది. సమాధానం రాకపోవడంతో గత రెండేళ్ల మాదిరిగానే నీటి వినియోగం జరుగాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

కర్తవ్యమేమిటీ? : నిటి పంపిణీ నిర్ణయం 2016-2017లో బాగా అమలు జరిగింది. కృష్ణా జలవివాద ట్రైబ్యునల్-2 అవార్డు కూడా ఇప్పటికి అమలులోకి రాలేదు. తత్ఫలితంగా పాత విధానాన్నే రెండు రాష్ట్రాలు కొనసాగించాలని కేంద్రం సూచించింది. అయితే ఈనెల 11న జరిగే కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం గతేడాది అమలులో తలెత్తిన సమస్యలపై చర్చించే అవకాశంఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy