నీట్ అరాచకంలో నలుగురిపై వేటు

NEET-Dress-Codeనీట్ ఎగ్జామ్ సందర్భంగా విద్యార్థినులను అవమానించిన టీచర్లపై వేటు పడింది. కఠిన నిబంధనల నేపథ్యంలో కేరళ కన్నూరులోని ఎగ్జామ్ సెంటర్ దగ్గర మెటల్ డిటెక్టర్ తో తనిఖీ చేసిన టీచర్లు.. ఓ విద్యార్థిని బ్రా ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థినిని ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించలేదు. అప్పటికే ఎగ్జామ్ కు టైమ్ అయ్యింది. ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినిపించుకోలేదు టీచర్లు. లోదుస్తుల్ని తప్పక తొలగించాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఇక చేసేది ఏమీ లేక ఆ విద్యార్థిని వారు చెప్పినట్టే చేయాల్సి వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది. సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు నెటిజన్లు. దీంతో టీచర్లపై వేటు వేశారు అక్కడి అధికారులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy