నీట్ లో మెరిసిన తెలుగు తేజాలు

NEET-Teluguఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌)–2017లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తొలి ప్రయత్నంలో ఘన విజయం సాధించారు. వీరిలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. 2017 –18 విద్యా సంవత్సరానికి మే 7న నీట్‌ ప్రవేశ పరీక్ష జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 66 వేల మంది, తెలంగాణ నుంచి 44 వేల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో రెండు రాష్ట్రాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.

జాతీయ స్థాయిలో టాప్‌ వంద ర్యాంకుల్లో 23 మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఆల్‌ ఇండియా 12వ ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన లక్ష్మిశెట్టి ఆర్నవ్‌త్రినాథ్‌ సొంతం చేసుకోగా, కడప జిల్లా రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో ఇంజనీర్‌గా పనిచేస్తున్న నర్రెడ్డి నవనీశ్వర్‌రెడ్డి కూతురు నర్రెడ్డి మాన్విత 14వ ర్యాంకు సాధించింది. సికింద్రాబాద్‌కు చెందిన మంగని దీపిక 24వ ర్యాంకు సాధించగా, హైదరాబాద్‌కు చెందిన అడుసుమిల్లి వెంకట హేమంత్‌ 30వ ర్యాంకు సాధించారు.

దేశ వ్యాప్తంగా జరిగిన నీట్‌ ప్రవేశ పరీక్షలో వెల్లడైన ఫలితాలు జాతీయ స్థాయిలోనివి మాత్రమే. రాష్ట్ర స్థాయి ర్యాంకులు నిర్ణయించేందుకు మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశముందని ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 27లోగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో 15 శాతం సీట్లను ఆల్‌ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. ఈ సీట్లు పొందడానికి అందరికీ హక్కు ఉంటుంది. అయితే ఆర్టికల్‌ 371డి నిబంధన వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్ము కశ్మీర్‌లకు ఇది వర్తించదు. దీంతో ఈ ప్రాంతాల్లోని మొత్తం సీట్లు అక్కడి విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. జూలై మొదటి వారంలో కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

నీట్‌ జాతీయ స్థాయి ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలదే హవా కొనసాగింది. మొదటి వంద ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 23 మంది ఉండగా అందులో 12 మంది అమ్మాయిలున్నారు. తొలి 56 ర్యాంకుల్లో 9 మంది అమ్మాయిలే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ర్యాంకు వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నర్రెడ్డి మాన్విత సొంతం చేసుకుంది. తండ్రి రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. మాన్వితకు జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు రాగా, రాష్ట్రంలో మొదటి ర్యాంకు దక్కించుకోనుంది.

 టాప్‌ 100లో ర్యాంకులు సాధించిన తెలుగు తేజాలు

పేరు   ——  ర్యాంకు

లక్ష్మిశెట్టి ఆర్నవ్‌ త్రినాథ్‌ -12( హైదరాబాద్‌)

నర్రెడ్డి మాన్విత -14( ప్రొద్దుటూరు)

మంగని దీపిక- 24 (హైదరాబాద్‌)

అడుసుమిల్లి వెంకట హేమంత్‌ -30 (హైదరాబాద్‌)

ఆలేటి అఖిల -32 ( హైదరాబాద్‌)

పావులూరి సాయి శ్వేత -36 (విశాఖపట్నం)

జంబుల అనూషారెడ్డి- 38 (హైదరాబాద్‌)

ఫణి శ్రీలాస్య- 51 (నెల్లూరు)

అంకిత దాస్‌ -52 (విశాఖపట్నం)

కొప్పురావూరి ప్రీతి- 56 (హైదరాబాద్‌)

సాధినేని నిఖిల్‌ చౌదరి- 57 (కూకట్‌పల్లి)

గాలివీడు మనోజ్‌పవన్‌రెడ్డి -59 (హిందూపురం)

తెలుగు నీరజ్‌ పవన్‌రెడ్డి- 70 (తాడిపత్రి)

దేవళ్ల మన్సీ దినేష్‌ -72 (సికింద్రాబాద్‌)

డొక్కు వంశీకృష్ణ 73 (రేపల్లె,గుంటూరు)

విశ్వనాథుని చైతన్యగోపాల్‌- 74 చల్లపల్లి (కృష్ణాజిల్లా)

వేణిగళ్ల శరణ్‌కుమార్‌ -86 (హైదరాబాద్‌)

కెవీఎన్‌వీఎస్‌ నేస్తంరెడ్డి- 89 (కాకినాడ)

వీరమాచినేని జైత్రి -90 (విజయవాడ)

టి.కాత్యాయని గౌడ్‌ -93 (హైదరాబాద్‌)

ఎన్‌.సాత్వికరెడ్డి -94 (కాకినాడ)

దాసరి సాయి సౌగంథ్‌ -98 (గద్వాల్‌)

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy