నీళ్ల కోసం నిరసనలు లేవు.. కరెంట్ కోతలు లేవు : సీఎం కేసీఆర్

KCRSప్రజా సమస్యల పరిష్కారమే  TRS ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు సీఎం కేసీఆర్. కోటి ఎకరాలకు నీరు ఇచ్చి, రాష్ట్రం నలుమూలలా ఎటు చూసిన ఆకుపచ్చ తెలంగాణ కనిపించాలన్నారు సీఎం కేసీఆర్. శుక్రవారం (ఏప్రిల్-27) TRS 17వ ప్లీనరీ సందర్భంగా ప్రసంగించిన కేసీఆర్.. వ్యవసాయానికి 24 గంటల క్వాలిటీ కరెంటు ఇస్తున్నామన్నారు.

ప్రతిపక్షాలు ఓర్వలేకనే రాద్దాంతం చేస్తున్నాయని.. తెలంగాణలో దివాలా తీసింది ఒక్క కాంగ్రెస్ పార్టీ, ఇన్వెర్టర్ కంపెనీవారని తెలిపారు. గ్రామాల్లో ఉండే ఆటో స్టార్టర్లను తీసివేయాలని, దీంతో భూగర్భజలాల్లో నీరు అందకపోవడంతో మోటార్లు కాలిపోతాయని చెప్పారు. ఇంటింటి నల్లా కనెక్షన్లు ఇస్తున్నామని, ఈ కార్యక్రమంలో నేతలు బిజీగా ఉన్నారన్న కేసీఆర్..మిషన్ భగీరథ ప్రపంచంలోనే హైలైట్ గా నిలుస్తుందన్నారు.

ఎండాకాలం వచ్చిందంటే నీళ్లనొల్లి కనిపించేదని, తాగునీటి సమస్యలు ఎక్కడా తలెత్తకుండా చర్యలు తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. మంచినీళ్లు, కరెంటు, హస్పిటల్, రిజిస్ట్రేషన్ తో ముందుకెళ్తున్నామన్నారు. మత్స్యకారులకు చేపలు అమ్ముకోవడానికి వెహికిల్స్ ఇస్తున్నామని, తెలంగాణలో మత్య్సకారులను బాగుచేయవచ్చే ప్లాన్ చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయతో అన్ని చెరువులు అభివృద్ధి చేస్తున్నామని, వర్షాలతో చెరువులు నిండి పంటలు బాగా పండుతాయన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఉన్న ప్రశాంతంగా తెలంగాణ ఎప్పుడూ లేదన్నారు. ప్లీనరీ కోసం TRS నేతలు అద్భుతంగా ఏర్పాట్లు చేశారన్నారు.

దేశ రాజకీయాల్లో ప్రభావశీల, క్రియాశీల పాత్ర పోషిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. ఇప్పటికే ఏడు దశాబ్దాలు గడిచిపోయాయని.. ఇక ఎదురుచూడబోమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దేశానికి శాపమని.. అరవై ఏళ్ల కాంగ్రెస్ వైఫల్యాలను టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని  సూచించారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు చివరి అనుమతి ఇప్పుడే వచ్చిందని తెలిపారు. కాళేశ్వరం ద్వారా 7 జిల్లాలలకు మేలు జరుగుతుందన్నారు. చరిత్రలో ఏ ప్రాజెక్టు కూడా ఇన్ని అనుమతులు సాధించలేదన్న సీఎం.. తెలంగాణ అధికారులు నిబద్ధతతో పని చేస్తున్నారన్నారు.

మంత్రులు రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. ఇష్టమొచ్చిన రీతిలో కొందరు నాయకులు విమర్శలు చేస్తున్నారు. అలా విమర్శలు చేయడం సరికాదన్నారు.  రాబోయే రెండు సంవత్సరాల్లో కోటి ఎకరాలకు నీరు పారాలని. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.  తెలంగాణలో దివాలా తీసింది ఇద్దరే ఒకటి కాంగ్రెస్ పార్టీ, మరొకటి జనరేటర్లు, ఇన్వర్టర్ల కంపెనీలు. జూన్, జులై నాటికి ప్రతి ఇంటిలో మంచినీటి సదుపాయం కల్పించాలన్నారు.

మే 10 నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుందన్న కేసీఆర్. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఎన్నో అవరోధాలను అధిగమించి.. విజయాలను సాధించామని.. త్వరలోనే తెలంగాణ కంటి వెలుగు పేరుతో మహత్తర కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేస్తామన్నారు. రైతుబంధు చెక్కుల పంపిణీ తర్వాత కంటి పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు చేస్తే జబ్బు తొందర గుర్తించే అవకాశం ఉంటుందని.. పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ హెల్త్ ప్రొఫైల్ పేరుతో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్న కేసీఆర్.. మరో 100 సెంటర్లు పెట్టాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తుందన్నారు. డయాలసిస్ సెంటర్లు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు సీఎం కేసీఆర్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy