నీహారికను చెల్లెలిగా చూస్తా : సాయి ధరమ్ తేజ్

saidharamtejniharikaకొణిదెల ఇంట్లో త్వరలో పెళ్లి. బావ – మరదుళ్లు అయిన సాయిధరమ్ తేజ, నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఇదీ వారం రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ప్రతి సినీ అభిమాని దగ్గర ఇదే అంశంపై చర్చ. ఈ ఇష్యూ ఇంత కంటే ముందుకు వెళ్లటం ఇష్టలేని హీరో ధరమ్ తేజ్.. తన ఆఫీస్ నుంచి ఓ నోట్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. చిన్నతనం నుంచి ఒకే కుటుంబంలో కలిసిమెలిసి పెరిగాం. ఒకరికొకరు అన్నాచెల్లెళ్లుగా భావిస్తారు. ఓ అమ్మాయికి సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాలపై వార్తలు రాసేముందు ధృవీకరించుకోవాల్సింది. ఈ వదంతులపై తీవ్ర కలత చెందా. ఇద్దరి కుటుంబాల్లో మనోవేదనకు కారణం అయ్యింది అంటూ వివరణ ఇచ్చారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy