నీ మనసు వెన్నసారూ : క‌మ‌ల‌వ్వ‌కు పెద్ద కొడుకైన కేటీఆర్‌

ktrన‌వ‌మాసాలు మోసి క‌ని పెంచిన త‌ల్లిని అనాథ‌లా వ‌దిలేశారు ఆ కుమారులు. వృద్దురాల‌న్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇంట్లోనుంచి గెంటేశారు. ఎర్ర‌టి ఎండ‌లోనే ఆ వృద్దురాలు ఆక‌లికి అల‌మ‌టించి…రోడ్డుపైనే కాలం వెల్ల‌దీయ‌సాగింది. ఆమె పరిస్థితి చూసి స్థానికులు అయ్యో అని జాలిప‌డ్డారే త‌ప్ప ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. అత్యంత బాధ క‌లిగించిన ఈ ఘ‌ట‌న సిరిసిల్ల జిల్లాలో జ‌రిగింది. ఆ త‌ల్లి పేరు క‌మ‌ల‌వ్వ‌.

క‌మ‌ల‌వ్వ‌కు న‌లుగురు కొడుకులు ఇద్ద‌రు కూతుళ్లు. అంద‌రికీ పెళ్లిళ్లు చేసి ఆస్తులు కూడా పంచిపెట్టింది. కానీ చివ‌ర‌కు ఆమె ప‌రిస్థితే రోడ్డుపాల‌వుతుంద‌ని పాపం ఊహించ‌లేక‌పోయింది. ఆస్తులు పంచ‌గా త‌న‌కు మిగిలిన ఒక చిన్న ఇంట్లో చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని జీవిస్తుండేది. పెద్ద కొడుకు మ‌హారాష్ట్ర‌లోని భివాండిలో ఉంటున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం సిరిసిల్ల‌కు వ‌చ్చి ఆ ముస‌లి త‌ల్లిని ఇంట్లోనుంచి గెంటేసి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. మిగ‌తా ముగ్గురు కుమారులు కూడా చేర‌దీసేందుకు ఒప్పుకోలేదు. దీంతో క‌మ‌ల‌వ్వ అంద‌రూ ఉన్న అనాథ‌లా మారింది. క‌మ‌ల‌వ్వ క‌థ‌నం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

క‌మ‌ల‌వ్వ క‌థ మంత్రి కేటీఆర్ దృష్టికి వ‌చ్చింది. ఆమె దీన గాథ‌ను విన్న కేటీఆర్ చ‌లించిపోయారు. ఆమెకు పెద్ద‌కొడుకై అండ‌గా నిలిచాడు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల‌లో ఇలా జ‌ర‌గ‌డం ఆయ‌న్ను మ‌రింతగా క‌ల‌చివేసింది. వెంట‌నే సంబంధిత అధికారుల‌కు ఆదేశాలిచ్చారు. క‌మ‌ల‌వ్వ‌కు స‌త్వ‌ర‌మే ఉండ‌టానికి నివాసాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు అందుకున్న అధికార యంత్రాంగం యుద్ధ‌ప్రాతిప‌దిక‌న క‌మ‌ల‌వ్వ‌కు ఉండేందుకు తాత్కాలికంగా ఇళ్లు ఏర్పాటు చేశారు. తిన‌డానికి తిండి ఇచ్చారు. ఇక‌పై క‌మ‌ల‌వ్వ బాధ్య‌త త‌నే తీసుకుంటున్న‌ట్లు కేటీఆర్ ట్విట‌ర్ ద్వారా తెలిపారు.

కేటీఆర్ చేసిన స‌హాయం ఎప్ప‌టికీ మ‌ర‌వ‌లేనంది కమ‌ల‌వ్వ‌. క‌మ‌ల‌వ్వ‌ను పెద్ద కొడుకులా ఆదుకున్న మంత్రి కేటీఆర్‌పై నెటిజ‌న్లు పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

3 Responses to నీ మనసు వెన్నసారూ : క‌మ‌ల‌వ్వ‌కు పెద్ద కొడుకైన కేటీఆర్‌

 1. Excellent ktr garu
  Okapudu movies lo etuvanti sanghatanalu jarigithe Reel hero’s sahayapadatharu it’s drama
  But here Real life oka thalli ki needa thindi pettaru urs commitment &responding way toooo excellent marichipolemu

 2. Anonymous says:

  Exllent sir your a great leader.

 3. Anonymous says:

  Good job KTR Sir

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy