నుమాయిష్ తో నగరంలో సందడి షురూ

numaish 201645 రోజుల ఎగ్జిబిషన్. 2 వేల 500 స్టాల్స్. దేశ, విదేశాల ఫర్నీచర్స్. ఇదీ రాజధానిలో గ్రాండ్ గా లాంఛయిన నుమాయిష్ సందడి అప్డేట్స్. సీఎం ఎగ్జిబిషన్ లాంఛ్ చేశారు. ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు నిర్వాహకులు.

రాజధానిలో నుమాయిష్ సందడి మొదలైంది. 76వ ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ గ్రాండ్ లాంచయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. భాగ్యనగరం గొప్పతనాన్ని చాటిచెప్పే నుమాయిష్ ఫిబ్రవరి 15 వరకు జరగనుంది. అన్ని రాష్ర్టాల ఉత్పత్తులతో 2 వేల 500 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ లాంఛింగ్ ప్రోగ్రామ్ కు సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల అధ్యక్షత వహించారు. లీజుపై ఉన్న భూమిని సొసైటీ పేరుతో ట్రాన్స్ ఫర్ చేయడానికి ప్రభుత్వం ఓకే చెప్పిందన్నారు ఈటెల. దేశవ్యాప్తంగా పారిశ్రామిక ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లలో నుమాయిష్ అతిపెద్దదన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలో 30 వేల మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు ఈటెల. అన్నిరంగాల పారిశ్రామిక, వ్యాపారవేత్తలు నుమాయిష్ లో తమ ఉత్పత్తులను ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకొంటామన్నారు ఈటెల.

ఎగ్జిబిషన్ కు వచ్చే వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సీసీ టీవీలు ఏర్పాటు చేశారు. అటు డ్వాక్రా సంఘాల ఉత్పత్తులు ఎగ్జిబిషన్ లో ప్రదర్శించే అవకాశమిచ్చారు. హోంమంత్రి నాయిని వాణిజ్య, పన్నులశాఖ మంత్రి తలసాని, ఎక్సైజ్  మినిస్టర్ పద్మారావు, ఎంపీలు కేకే, బూర నర్సయ్యగౌడ్ సొసైటీ నేతలు అటెండయ్యారు.  ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ జరుగనుండడంతో నాంపల్లిలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అటు సిటీలోని అన్ని ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ కు వచ్చేందుకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తోంది ఆర్టీసీ.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy