నువ్వు సూపరహే: స్కైడైవ్ @ 101

skydive-101101 ఏళ్ల పెద్దాయన.. వరల్డ్ రికార్డు నెలకొల్పారు. అంత వయస్సులో స్కైడైవ్ చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు బ్రిటన్‌కు చెందిన బ్రైసన్ విలియం వెర్డన్‌ హయేస్‌. అధికారిక లెక్కల ప్రకారం ఆయన వయసు 101 ఏళ్ల 38 రోజులు.   ఈ మాజీ సైనికుడికి మరో ప్రత్యేకత కూడా ఉంది. రెండో ప్రపంచయుద్ధంలో పోరాట వీరుడిగా ప్రశంసలు అందుకున్నారు. గుండెధైర్యంలో సాటిలేని వీరుడిగా పేరున్న హయేస్.. ఈజీగా స్కైడైవ్ చేశారు. భూమికి 15 వేల అడుగుల ఎత్తులో విమానం నుంచి శిక్షకుడి సాయంతో దూకేశారు. గతంలో ఈ రికార్డు కెనడాకు చెందిన వ్యక్తి(101 ఏళ్ల 3 రోజులు) పేరిట ఉండేది. గతేడాది తన 100వ పుట్టినరోజున కూడా హయేస్‌ స్కైడైవ్‌ చేసి.. బ్రిటన్‌లో ఈ సాహసకృత్యం పూర్తిచేసిన అత్యధిక వయస్కుడిగా రికార్డులకెక్కారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy