నూతన వధువు…సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అదృశ్యం

MISSINGపెండ్లి అయిన రెండు నెలలకే అదృశ్యమైంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఈ సంఘటన కంచన్‌ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చంపాపేట, రాజిరెడ్డినగర్‌ లో నివాసం ఉండే ప్రదీప్ విశ్వనాథం, వాసంతిలకు రెండు నెలల క్రితం వివాహం జరిగిందని, వీరిద్దరు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారని చెప్పారు ఎస్‌ఐ అనిల్‌కుమార్. మే- 2న వాసంతి (25) ఉదయం 9 గంటలకు హైటెక్ సిటీలోని తార డాటా కంపెనీకి వెళ్లింది. సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త, బంధువులు, తెలిసినవారి ఇండ్లల్లో వెదికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy