నెక్లెస్ రోడ్డులో ‘లవ్ హైదరాబాద్’

love-hyderabad-shifted-to-necklace-road-elyuxenహైదరాబాద్ నగరవాసులనే కాకుండా దేశవ్యాప్త పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్న ‘లవ్‌ హైదరాబాద్‌’  సింబల్  ప్రస్తుతం కొన్నిరోజుల విరామం తర్వాత  నెక్లెస్‌రోడ్డులో కొలువుతీరింది. గతంలో ఈ చిహ్నం ట్యాంక్‌బండ్‌పై ఉండేది. అయితే పర్యాటకులు, నగరవాసులు తమ వాహనాలు రోడ్డుపైనే ఆపి ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తూ దాని దగ్గర సెల్పీలు, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడటంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తేవి. దీంతో ఆ చిహ్నాన్ని అక్కడ్నుంచి తొలగించి నెక్లెస్‌రోడ్‌లో నెలకొల్పాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేని ప్రదేశమైన నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా పక్కన క్రేన్‌ సాయంతో నెలకొల్పి దానికి రంగులు అద్దుతున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy