నెరవేరబోతున్న దశాబ్దాల కల

Telangana UPA
దశాబ్దాల కల. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరే గడియలు. ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు దాటుకొని పార్లమెంట్ గడప తొక్కిన రాష్ట్ర విభజన బిల్లుపై చర్చకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ లోక్ సభలో బిల్లుపై చర్చ జరగనుంది. 19 లేదంటే 20 న పెద్దల సభలో తెలంగాణ బిల్లు ఎంట్రీ ఇవ్వనుంది. పార్లమెంట్ సమావేశాలు ముగియడానికి ఒక్క రోజు ముందే ..టీబిల్లుకు ఉభయ సభల ఆమోద ముద్ర పడేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది యూపీఏ సర్కార్. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరే సమయం రానేవచ్చింది. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ బిల్లుపై లోక సభలో ఇవాళ చర్చ జరగనుంది. పార్లమెంట్ సమావేశాలు ముగియడానికి మరో 4 రోజులే ఉండటంతో ..ఒకరోజు ముందే పార్లమెంట్ ఉభయ సభల్లో విభజన ప్రక్రియను ముగించడానికి వ్యూహం సిద్ధం చేసింది కాంగ్రెస్. సమైక్యవాదులు వ్యతిరేకించినా, విపక్షాల నుంచి విమర్శలు ఎదురైనా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును చర్చకు చేపట్టేందుకు సిద్ధమైంది. టీబిల్లుపై మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటలదాకా చర్చ జరిగే చాన్స్ ఉంది. సాధ్యమైనంత వరకు ఇవాళే బిల్లు ఆమోదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు అడ్డుకుంటే..సభ రేపటికి వాయిదా పడొచ్చు. బుధవారం కూడా అదే పరిస్థితి ఉంటే..మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం పొందాలని సర్కార్ పెద్దలు డిసైడ్ చేసినట్టు టాక్. అయితే టీబిల్లును వంద శాతం ఆమోదించి తీరతామని పార్లమెంటరీ వ్యవహారాల మినిస్టర్ కమల్ నాథ్ స్పష్టం చేస్తున్నారు. లోక్ సభ చర్చ తర్వాత..టీబిల్లు పెద్దల సభలో ఎంట్రీ ఇవ్వనుంది. 19, 20 తేదీల్లో రాజ్యసభలో పెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. టీ-బిల్లుపై చర్చకు రెండు గంటల సమయాన్ని కేటాయించారు చైర్మన్ హమీద్ అన్సారీ . ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు చర్చను ప్రారంభించి రాత్రి 7 గంటలకు ముగించే అవకాశాలున్నాయి. రాజ్యసభలోనూ చర్చ జరిగే అవకాశాలు తక్కువే. పెద్దల సభలోనూ మూజువాణి ఓటుతోనే ఆమోదించే చాన్సెస్సే ఎక్కువగా ఉన్నాయి.విభజన బిల్లుపై మాట్లేడేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రెడీ అవుతున్నారని టాక్. ప్రసంగ పాఠాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. తెలంగాణపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టో అంశాలను సోనియా చెప్పనున్నారు. పదేళ్లుగా చేసిన కృషి, పార్టీల నుంచి అభిప్రాయాల సేకరణ. 2009 డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన కూడా మేడం స్పీచ్ లో ఉండే అవకాశాలున్నాయి.
ఎలాగైనా ఈ సెషన్ లోనే టీబిల్లుకు..ఆమోదముద్ర వేయించాలని కాంగ్రెస్ ఫిక్స్ అయిపోయింది. అవసరమైతే బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు సమావేశాల్ని ఒకట్రెండు రోజులు పొడిగించే చాన్స్ కూడా లేకపోలేదంటున్నారు .

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy