నెలరోజుల్లో దేశంలో గుణాత్మక మార్పు చూపిస్తా : కేసీఆర్ పూర్తి ప్రసంగం

విజయ గర్వం తలకెక్కించుకోం

విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత అంతే బరువుగా ఉంది

కాంగ్రెస్ ముఫ్త్ భారత్… బీజేపీ ముఫ్త్ భారత్

దేశానికి ఆర్థిక మోడల్ అవసరం

ఖమ్మంలో మా పొరపాట్లతోనే ఓడిపోయాం

అసద్, నేను మైనారిటీలను ఏకం చేస్తాం

నెలరోజుల్లో గుణాత్మక మార్పు చూపిస్తాం

మందిర్… సర్జికల్ స్ట్రైక్.. తోక స్ట్రైక్ అవసరం లేదు

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా : కేసీఆర్

 

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు సీఎం కేసీఆర్. సకల జనులు దీవించి ఇచ్చిన అద్భుత విజయం ఇది అన్నారు. వారికి శిరసు వంచి నమస్సులు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ రాత్రిపగలు కష్టపడ్డారని చెప్పారు. విజయం తలకెక్కించుకోకుండా.. హుందాగా, అణుకువతోనే ఉండాలని.. అహంకారం పనికి రాదని కేడర్ కు చెప్పారు కేసీఆర్.

విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత అంతే బరువుగా ఉంది

“కోటి ఎకరాలు పచ్చబడాలి. రాజీలేకుండా ఈ లక్ష్యం పూర్తికావాలి. టీఆర్ఎస్ ను గెలిపిస్తే కాళేశ్వరం.. కూటమిని గెలిపిస్తే శనేశ్వరం అని ఎన్నికల్లో చెప్పాం. ప్రజల ఆకాంక్ష నెరవేర్చుతాం. ధనికులు తెలంగాణలో ఉన్నారన్న పేరు రావాలి. ఆరు నెలల్లో భూ యాజమాన్య హక్కుల సమస్యను పరిష్కరిస్తాం. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. ప్రభుత్వేతర రంగంలో విరివిగా ఉద్యోగాలు కల్పిస్తాం. విజయం ఘనంగా ఉందో బాధ్యత బరువుగా ఉంది. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 2వేల పెన్షన్ ఆసరాతో తెలంగాణ ధీమాగా బతకాలి. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ కోసం ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తాం. హైగ్రేడ్ పాథాలాజికల్ టీమ్ జనంలోకి వెళ్తుంది. మొత్తం ప్రజల యొక్క తెలంగాణ హెల్త్ స్టేటస్ రికార్డ్ చేస్తాం”. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు.. అన్ని కులాల్లోని పేదలను ఆదుకుంటాం అన్నారు. ఎన్నికలను సమర్థంగా నిర్వహించిన ఈసీకి, స్టేట్ ఈసీకి కృతజ్ఞతలు.

కాంగ్రెస్ ముఫ్త్ భారత్… బీజేపీ ముఫ్త్ భారత్

“దేశ రాజకీయాల్లో కూడా పాత్ర వహించాలి. తెలంగాణపై ఆ బాధ్యత ఉంది. తెలంగాణ ఏంటో ఇండియాకు చూపించాలిప్పుడు. పార్టీలు.. నాయకులు కాదు.. ఇవాళ ప్రజలు గెలిచారు. ఎన్ని ప్రచారాలు చేసినా ఏం జరిగినా.. మేం చాలా కూల్ గా ఉన్నాం. మా పనేందో మేం చేసుకున్నాం. జనం కూడా ఎవరు ఏమన్నా పట్టించుకోలే. అంతిమనిర్ణయం ప్రజలు చెప్పారు. ఇక… దేశ రాజకీయాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషించబోతోంది. దేశానికి తెలంగాణ దిక్సూచి. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పరిపాలన రావాలి. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ స్టేట్ తెలంగాణ. మాకు ఎవరూ బాస్ లు లేరు. మేం ప్రజల ఏజెంట్లం. ఎవరి గులాం గిరీ చేయం” అన్నారు.

దేశానికి ఆర్థిక మోడల్ అవసరం

“ఈ దేశానికి  70 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడుకోనందుకు పాలించిన నాయకులు సిగ్గుపడాలి. ఆర్థిక మోడల్ దేశానికి అవసరం. వ్యవసాయ మోడల్ కావాలి. వ్యవసాయపరంగా చాలా రిచ్ దేశం మనది. ప్రపంచానికి వ్యవసాయోత్పత్తులను ఇవ్వగలం. కానీ ఉత్పత్తిపై ఫోకస్ చేయడంలేదు. ఇజ్రాయెల్, చైనాతో మనం ఎక్కడా పోటీలో లేం. 15కోట్ల మంది రైతులు ఉన్నారు ఈ దేశంలో. అన్నమో రామచంద్ర అంటున్నారు. ఆగ్రో ఎకనామిస్ట్ అశోక్ గులాటీ ఓ ఆర్టికల్ రాశారు. రైతులకు ఏం చేయాలో తెలంగాణ ఓ దారి చూపించింది అని అందులో ఉంది. రైతుకు పెట్టుబడి సాయం రూ.4 వేలు,  రూ.5వేలు ఇస్తుంటే.. వారికి ఓ భరోసా వచ్చింది. స్వామినాథన్ కూడా ఈ స్కీమ్ ను ప్రశంసించారు. హైదరాబాద్ నుంచే దేశ రాజకీయాలపై పని మొదలుపెడతాం. దేశ రైతులకు పిలుపునిస్తున్నాం. ఉమ్మడిగా ఉద్యమిద్దాం. ఆశ కోల్పోవద్దు. ఇది పార్టీలను ఏకం చేయడం కాదు. రాజకీయాన్ని, ప్రజలను ఒక్కటి చేయబోతున్నాం” అన్నారు.

ఖమ్మంలో మా పొరపాట్లతోనే ఓడిపోయాం

అసద్, నేను మైనారిటీలను ఏకం చేస్తాం

“ఖమ్మంలో మమ్మల్ని వేరేపార్టీ మమ్మల్ని చంపలేదు. మా పొరపాట్ల వల్లే మేం ఓడిపోయాం. మంత్రులు, స్పీకర్ ఓడిపోయారు. వారితో మాట్లాడి ఓదార్చాను. చూసుకుందాం ముందుకుపోదాం అన్నాం. అసద్ కు థ్యాంక్స్. కలిసి భోంచేశాం. చాలామంది థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడారు. ముస్లింల గురించి మాట్లాడాం. దేశమంతా తిరిగేందుకు రెండు ఎయిర్ క్రాఫ్ట్ లు సిద్ధం చేసుకున్నాం. ఇండియన్ కమ్యూనిటీని ఒకటి చేయాలంటే ఏం చేయాలి. ఎక్కడ ఎంత మంది మైనారిటీలున్నారు అనేదానిపై అసద్, నేను మాట్లాడుకున్నాం. డివైసివ్ పాలిటిక్స్ నుంచి ఇండియాను ఒక్కటి ఎలా చేయాలనేది మాట్లాడుకున్నాం” అన్నారు కేసీఆర్.

నెలరోజుల్లో గుణాత్మక మార్పు చూపిస్తాం

మందిర్… సర్జికల్ స్ట్రైక్.. తోక స్ట్రైక్ అవసరం లేదు

వీళ్లు కాకపోతే వాళ్లు.. వాళ్లు కాకపోతే వీళ్లు గెలుస్తారు. అది విని మనం బఫూన్ కావాల్నా? ఇది మారాలి. ప్రత్యామ్నాయం రావాలి. ఒక చిన్న ప్రాథమిక అవసరాన్ని జాతీయ పార్టీలు ఫుల్ ఫిల్ చేయలేకపోయాయి. సెన్స్ లెస్ రాజకీయం చేయొద్దు. నేషనల్ ఫ్రంట్ అనేది రాజకీయ పార్టీలను ఏకం చేసేది కాదు.. ప్రజలను ఏకం చేసేది రావాలి. బిగినింగ్ చిన్నగనే ఉంటుంది. కానీ ఆలోచన ఉండి.. ఉన్నచోటే కుమిలిపోవడం మాకిష్టం లేదు. కచ్చితంగా మేం పనిచేసి… నెలరోజుల్లోపల అద్భుతమైన గుణాత్మక మార్పు భారత రాజకీయాల్లో చూడబోతున్నారు. హై క్వాలిటేటివ్ చేంజ్ చూపిస్తాం. బీజేపీ ముఫ్త్ భారత్.. కాంగ్రెస్ ముఫ్త్ భారత్. ఇదే కావాలి మనకు. నవరత్నాలు పోయి.. మహారత్నాలు అయ్యింది. రూ.9.5 కోట్లు మురిగిపోయి ఉంది. దానిని వాడరు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర రూ.8, 9 లక్షల కోట్లు ఉన్నాయి. రూ. 15,16 లక్షల కోట్లు నెట్ ఉన్నా.. కానీ వాడే తెలివితేటలు కేంద్రానికి లేవు. మందిర్ కావాలి.. సర్జికల్ స్ట్రైక్.. తోక స్ట్రైక్ ఇవి.. మైండ్ ను ఎంగేజ్ చేసే వీటితోనే జనం కొట్టుక సావాల్నా..? బ్రాడ్ గా విశ్లేషిద్దాం.. గొప్పగా ఆలోచిద్దాం”అని చెప్పారు కేసీఆర్.

నీ అయ్య జాగీరా.. రిజర్వేషన్లు ఎందుకు పెంచవు

రాష్ట్రానికో సుప్రీంకోర్టు ఉండాలి

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి.. పెంచం అంటే.. నువ్వెవడివి… నీ అయ్య జాగీరా… మేం చేస్తాం.. మేం రాకుండా చేస్తాం అనడం కరెక్ట్ కాదు. దేశమంతా… కాంగ్రెస్, బీజేపీ కి వ్యతిరేకంగా ఉందిప్పుడు. అందరినీ బానిసలుగా మార్చాలని చూస్తున్నారు. దేశానికి మొత్తం ఒకటే సుప్రీంకోర్టు ఉంటుందా. విదేశాల్లో ఏ రాష్ట్రం హక్కులు అక్కడే నిర్ణయించుకుంటాయి. 75 ఏళ్లు గడిచాయి. ఇంకెన్ని రోజులు ఎదురుచూడాలి. రాజకీయ పార్టీలను ఏకం చేయడం పెద్ద ప్రతిపాదన కానేకాదు. జనాన్ని ఏకం చేస్తాం. మార్పు చూపిస్తాం” అని అన్నారు కేసీఆర్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy