అన్నదాతను ఈ ఏడు ముందుగానే తొలకరి పలకరించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దక్షణ అండమాన్, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సుమద్రం దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో..నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు భారత వాతవరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా జూన్ 1, 2 తేదీల్లో కేరళను తాకాల్సిన రుతుపవనాలు..రెండు రోజుల ముందుగానే రానున్నాయి. నైరుతి ప్రభావంతో ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, బెంగాల్, మహారాష్ట్రలోనూ మోస్తరుగా వాన చినుకులు పడ్డాయి.
రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. ఈనెల 30లోగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయంటున్నారు. రుతుపవనాల ఎంట్రీతో జూన్ మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో నైరుతి జల్లుల పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
రుతుపవనాలు రెండు రోజులో ముందే పలకరిస్తున్నా..ఎల్ నినో గండం వెంటాడుతోంది. ఎల్ నినో ఎఫెక్ట్ తో సాధారణ వర్షపాతనికంటే తక్కువ వర్షపాతం ఉండే అవకాశాలున్నాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.