నెల జీతం ఒక్క రూపాయి…ఆస్తి 66 కోట్లు

9316-7378-Ms.J.Jayalalithaa1991 లో ఆమె జయలలిత ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు తన ఆస్తుల విలువ 3 కోట్లుగా చూపెట్టారు. సీఎంగా ఉన్న కాలంలో నెలకు ఒక్క రూపాయి జీతం మాత్రమే తీసుకున్న జయ, 1996 లో సీఎంగా దిగిపోయేసరికి రూ.66 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు డీఎంకే పార్టీ ఆరోపించింది. జయలలిత దత్తత కొడుకు సుధాకరన్‌ పెళ్లికి కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు… ఆమెకు 28 కిలోల బంగారం, 12,000 చీరలు, 100 ఎకరాల భూమి ఉందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 1996లో తమిళనాడు రాష్ట్ర నిఘా, అవినీతి నిరోధక విభాగం చెన్నైలోని ప్రత్యేక కోర్టులో కేసు వేసింది. ఇవే ఆరోపణలతో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కూడా మరో కేసు వేశారు. ఈ కేసులో జయ సన్నిహితురాలు శశికళ, దగ్గరి బంధువు ఇళవరసి, ఒకప్పుడు జయ దత్తత చేసుకున్న సుధాకరన్‌లు కూడా నిందితులుగా ఉన్నారు. జయ సీఎంగా ఉన్నందున చెన్నైలో కేసును విచారించడం సరికాదని, విచారణ న్యాయంగా జరగదని, అందువల్ల ఈ కేసును వేరే రాష్ట్రంలోని కోర్టుకు ట్రాన్స్ ఫర్ చేయాలని 2003లో డీఎంకే సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. దాంతో ఈ కేసును బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం ఆదేశాలిచ్చింది. కేసు విచారణలో నాలుగుసార్లు జయ కోర్టుకు హాజరయ్యారు. 1,339 ప్రశ్నలకు జవాబిచ్చారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy