నేటితరం నేతలకు వెంకయ్య ఆదర్శం: కేసీఆర్

kcrఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి తెలంగాణ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు సీఎం కేసీఆర్. సన్మానించుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉన్నతస్థాయికి ఎలా ఎదగాలో వెంకయ్యను చూసి నేర్చుకోవచ్చని తెలిపారు. చాలామంది అనేక పదవులు అనుభవిస్తారు కానీ.. వెంకయ్యనాయుడిలా పదవికి వన్నె తెచ్చే నేతలు కొందరే ఉంటారని.. జాతీయస్థాయికి ఎదిగినా మూలాలు మరిచిపోని మనిషి ఆయన అన్నారు సీఎం. నిన్నటి వరకు మనలో ఒకరిగా ఉన్న వెంకయ్యనాయుడు ఈరోజు ఉపరాష్ట్రపతి కావడం గర్వకారణంగా ఉందన్నారు. నేటితరం రాజకీయ నేతలకు ఆయన ఆదర్శమన్నారు.

ఆయన ఇంకేమన్నారంటే… ఎదుగుతూ.. ఎదుగుతూ.. ఒదుగుతూ.. ఒదుగుతూ అత్యున్నత పదవిని పొందడం మనకు గర్వకారణం. ఒకప్పుడు ఢిల్లీకి వెళితే తెలుగువాళ్లను మదరాసీలని పిలిచేవారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. తెలుగుబిడ్డకు పదవి రావడం అదృష్టం. వెంకయ్య నాయుడు గొప్ప వక్త.. ఆ వక్త వెనక ఎంత కృషి ఉంటుందో ఎవరికీ తెలియదు. ఉపన్యాసాన్ని పండించడంలో అద్భుతమైన భాష, భావం ఉంటేనే సాధ్యం. వారు హిందీలో మాట్లాడినా తెలుగు మాట్లాడినంత సులభంగా మాట్లాడేస్తారు. చదువది ఎంత కల్గినా.. రసజ్ఞత చాలినంత లేకపోతే.. మేధావుల మన్నన పొందలేరు. వెంకయ్య రసజ్ఞత కలిగిన వక్త. 70లలో తొలిసారి చూశాను.. విద్యార్థి దశ నుంచి విప్లవ రాజకీయాల వైపు ఆలోచిస్తున్న సమయం.. మా ప్రాంతానికి సిద్ధిపేటకు వచ్చారు. అప్పటి నుంచి పరిచయం. ఆయన పలకరింపులో ఆత్మీయత ఉంది. మనవాళ్లు అన్న భావం కనపడుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy