నేటి నుంచి ‘ఆసరా’ పెన్షన్ల పంపిణీ…

పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. పాలమూరు జిల్లాలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అర్హతున్న ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పెంచిన కొత్త పెన్షన్లను   ‘ఆసరా’ పేరుతో  ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ఈ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేస్తారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వెయ్యిమందికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ప్రతి జిల్లాలో మంత్రి ఈ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయనున్నారు. అర్హులైనవారికి ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తామని, అర్హులు ఎప్పుడు అప్లికేషన్ ఇచ్చినా పింఛన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy