నేటి సాయంత్రం బాలానగర్ ఫ్లైఓవర్ కు కేటీఆర్ శంకుస్థాపన

ktr copyబాలానగర్ చౌరస్తాలోని వాహనదారుల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులను త్వరలో పరిష్కారించడానికి తలపెట్టిన ఫ్లైఓవర్ బ్రిడ్జీకి ఇవాళ సాయంత్రం శంకుస్థాపన చేస్తారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. స్టాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా బాలానగర్ చౌరస్తాలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జీని రూ.387 కోట్లతో నిర్మించతలపెట్టారు.చాలాకాలం తర్వాత హెచ్‌ఎండీఏ నేతృత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ప్రాజెక్టు ఇదేనని అధికారులు తెలిపారు.

బాలానగర్ విమల్ థియేటర్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ మేఘనా కాంప్లెక్స్ వరకు 1.32 కిలోమీటర్ల మేర పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో రూ.282.47 కోట్లు భూ సేకరణకు, రూ.104.53 కోట్లు వంతెన నిర్మాణానికి వ్యయం అవుతుందని అంచనా వేశారు. కూకట్‌పల్లి వై జంక్షన్ నుంచి సికింద్రాబాద్, మెదక్ జిల్లా వైపు, సనత్‌నగర్, ఫత్తేనగర్ నుంచి జీడిమెట్ల, కూకట్‌పల్లి వైపు అధికంగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ రెండు మార్గాల నుంచి వచ్చే వాహనాలతో నర్సాపూర్, ఫత్తేనగర్ జంక్షన్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది.ఈ పరిస్థితుల్లో ఫ్లైఓవర్ నిర్మించి నర్సాపూర్, ఫత్తేనగర్ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ నుంచి విముక్తి కల్పించాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకే ఈ బ్రిడ్జీని త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు చురుకుగా పని చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy