నేడు తిరుమలకు సీఎం

tirumalaముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ(ఫిబ్రవరి 21న) తిరుమల వెళ్తున్నారు. సాయత్రం 4 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి బయల్దేరనున్నారు. 5 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తారు. రాత్రి తిరుమలలోనే ఉండనున్న కేసీఆర్ రేపు ఉదయం వెంకన్నను దర్శించుకోనున్నారు. సీఎంతో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఐకేరెడ్డి, పద్మారావులు తిరుమల వెళ్తున్నారు.

శ్రీనివాసుడిని దర్శించుకున్న తర్వాత 5 కోట్ల 59 లక్షలతో తయారు చేయించిన సాలగ్రామహారం, కంఠాభరణాన్ని సమర్శింపుకోచనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కానుకలు సమర్పిస్తానని మొక్కుకున్నారు కేసీఆర్. తర్వాత తిరుమలలోని పుష్పగిరిమఠ్ లో జరిగే రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి పెళ్లికి అటెండ్ కానున్నారు సీఎం. మధ్యాహ్నం 11.30 కు తిరుచానూర్ లోని పద్మావతి అమ్మవారి దేవాలయానికి వెళ్లనున్నారు సీఎం. అక్కడ అమ్మవారిని దర్శించుకొని బంగారు ముక్కుపుడక సమర్పించనున్నారు.

దాదాపు 30 ఏళ్ల తర్వాత సీఎం కేసీఆర్ తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారు. భద్రతను పర్యవేక్షించడానికి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికార్లతోపాటు సీఎం సెక్యూరిటీకి చెందిన సీనియర్ పోలీస్ అధికారి నిన్ననే తిరుపతి వెళ్లారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర ఉన్నతాధికారులు తిరుపతి చేరుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy