నేడు నెల్లూరుకు సచిన్..

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నేడు ఏపీలోని నెల్లూరుకు రానున్నారు. ఇవాళ, రేపు ఆయన నెల్లూరు జిల్లాలోనే ఉండనున్నాడు. ప్రధాని మోడీ ఆదర్శ్ గ్రామ్ యోజన స్కీం కింద నెల్లూరులోని ఓ గ్రామాన్ని సచిన్ దత్తత తీసుకున్నాడు. ప్రతి ఎంపీ కూడా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, ఆదర్శంగా మార్చాలని మోడీ ఆదేశించారు. దీంతో రాజ్యసభ ఎంపీ అయిన సచిన్ నెల్లూరులోని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని సెలక్ట్ చేసుకున్నాడు.

ఈ రోజు సాయంత్రానికి నెల్లూరు వచ్చి, రేపు కండ్రిగ గ్రామంలో వీధి వీధీ తిరుగుతాడు సచిన్. ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఫ్యాన్స్ రెడీ అయ్యారు. కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో  వారి ఆశలన్నీ అడిఆశలయ్యాయి. సచిన్ మీటింగ్ కు కేవలం ఆ ఉరి ప్రజలకే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. దీంతో మిగతావారు అక్కడకు వచ్చే అవకాశం లేదు. సచిన్ టూర్ కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy