నేడు బాబుజగ్జీవన్‌రామ్ జయంతి

Jagjeevan-ramబాబుజగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా గురువారం (ఏప్రిల్-5) హైదరాబాద్ లోని ఎల్బీస్టేడియం వద్ద ఉన్న బీజేఆర్ విగ్రహం పరిసర ప్రాంతాల్లో ఉదయం 5నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు ఉంటుందని తెలిపారు నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్. ఆంక్షల క్రమంలో ఈ రూట్‌లో వెళ్లేవారు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ రూట్లల్లో వెళ్లాలని సూచించారు.

– నాంపల్లి, చాపల్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం వైపు అనుమతి లేదు. ఈ వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి పోలీస్ కంట్రోల్ రూట్ వైపు వెళ్లాలి.
– SBH గన్‌పౌండ్రీ వైపు నుంచి BJR చౌరస్తాకు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలు చాపల్‌రోడ్డు మీదుగా వెళ్లాలి.
– రవీంద్రభారతి వైపు నుంచి BJR చౌరస్తాకు వచ్చే వాహనాలు ఫతేమైదాన్, KLR బిల్డింగ్ వద్ద నుంచి సుజాత హైస్కూల్ వైపుకు వెళ్లాలి.
– బషీర్‌బాగ్ ఫ్లెఓవర్ నుంచి వచ్చే వాహనాలకు చౌరస్తాలో కుడివైపు తీసుకునే అవకాశం లేదు. ఈ వాహనదారులు గన్‌పౌండ్రీ వైపునకు వెళ్లి, అక్కడ కుడి వైపుకు తీసుకొని తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy