నేడే కౌంటింగ్ : కర్ణాటక ఫలితాలపై సర్వాత్రా ఉత్కంఠ

ELECTIONSదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అంతా రెడీ అయ్యింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40 చోట్ల కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. 9 గంటల కల్లా మొదటి ఫలితం వచ్చే అవకాశముంది. మధ్యాహ్నం కల్లా …పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సెంటర్స్ దగ్గర మూడంచెల సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు. రాష్ట్ర పోలీసులతో పాటు, కేంద్ర బలగాలను కూడా స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాల దగ్గర మోహరించారు.

కర్ణాటక అసెంబ్లీలో 224 నియోజకవర్గాలు ఉండగా.. .ఈ నెల 12న …222 నియోజకవర్గాల్లోనే పోలింగ్ జరిగింది. బీజేపీ అభ్యర్థి మృతి కారణంగా జయనగర్ లో, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ….రాజరాజేశ్వరి నగర్ లో పోలింగ్ నిర్వహించలేదు. రాష్ట్రంలో మొత్తం 72.13 శాతం ఓటింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్ని హంగ్ ఏర్పడుతుందని అంచనా వేసిన నేపథ్యంలో …ఫలితాలపై ఆసక్తి ఏర్పడింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్యే ప్రధాన పోటీ అని స్పష్టంగా తెలుస్తున్నా… JDS ఎన్ని సీట్లు గెలిచి కింగ్ మేకర్ గా నిలుస్తుందనేది కీలకం కానుంది. 222 అసెంబ్లీ సీట్లలో …112 సీట్లు గెలిచిన పార్టీదే అధికారం. దీంతో మ్యాజిక్ ఫిగర్ ఎవరు అందుకుంటారో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠతో పాటు బరిలో నిలిచిన సీఎం, సీఎం అభ్యర్థులు, మంత్రులు, ప్రముఖుల భవిష్యత్తు మరికాసేపట్లో తేలనుంది. కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరి, బాదామీల నుంచి బరిలో నిలిచారు. JDS నుంచి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చెన్నపట్టణ, రామనగర్ లలో పోటీ చేశారు. బీజేపీ నేత శ్రీరాములు మొలకల్మూరు, బాదామీల నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యెడ్యూరప్ప నియోజకవర్గం శికరిపురలో ఆయన గెలుపు ఈజీనేనని అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ నియోజకవర్గాలపైనే ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు… దేశంలోనే అత్యంత ఖరీదైన అసెంబ్లీ ఎన్నికలని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా వేసింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టినట్టు తెలిపింది. అభ్యర్థులు, పార్టీలు పెట్టిన ఖర్చు …9వేల 500 కోట్ల నుంచి 10వేల 500 కోట్ల మధ్య ఉండవచ్చని ఎస్టిమేట్ చేసింది. 2013 అసెంబ్లీ ఎన్నికల ఖర్చు కన్నా… ఇది రెండురెట్లు ఎక్కువని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి, సభలకు అయిన ఖర్చును ఇందులో కలపలేదు. దీన్ని బ ట్టి చూస్తే … 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల ఖర్చు దాదాపు 50 వేల కోట్ల నుంచి 60వేల కోట్ల వరకూ ఉండొచ్చని CMS అంచనా వేసింది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy