నేడే చూడండి: ‘ఇందూ సర్కార్’పై స్టేకు సుప్రీం నిరాకరణ

indu-sarkar1975 ఎమర్జెన్సీ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మధుర్‌ భండార్కర్‌ రూపొందించిన సినిమా ‘ఇందూ సర్కార్‌’. ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగాయి. విడుదలపై స్టే విధించాలన్న పిటిషన్‌ను జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ అమితావ్‌ రాయ్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ సినిమా చట్టబద్ధ పరిమితులకు లోబడిన కళాత్మక వ్యక్తీకరణ అని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా శుక్రవారం(జూలై 28) విడుదలకానుంది. 1975లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తంగా ‘ఇందూ సర్కార్‌’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని సంజయ్‌గాంధీ కూతురిగా చెప్పుకుంటున్న ప్రియా సింగ్‌ పాల్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy