నేడే బడి : ముగిసిన సమ్మర్ హాలిడేస్

shoolవేసవి సెలవులు ముగిశాయి. ఇవాళ్టి నుంచి బడి బాట పట్టనున్నారు విద్యార్ధులు. శుక్రవారం (జూన్-1) నుంచి రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి. గతంకంటే.. ఈసారి 10రోజుల ముందే బడిగంట మోగింది. రాష్ట్రావతరణ వేడుకలు ప్రతీ బడిలో జరపాలనే ప్రభుత్వ నిర్ణయంతో.. ముందుగానే ప్రారంభిస్తున్నారు. శుక్రవారం (జూన్-1), శనివారం (జూన్-2) ఫుల్ డే స్కూల్స్ పెడుతున్నప్పటికీ.. ఎండతీవ్రత తగ్గకపోవడంతో 4 నుంచి 8వ తేదీ వరకు ఒంటిపూట బడులు నడపాలని నిర్ణయించింది విద్యాశాఖ. జూన్ 4 నుంచి 8 వరకుబడి బాట కార్యక్రమం జరపనున్నారు. ఇప్పటికే స్కూళ్లకు పుస్తకాలు, యునిఫామ్స్ చేరాయంటున్నారు విద్యాశాఖ అధికారులు. మొదటిరోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించటంతోపాటు.. వివిధ రకాల కాంపిటిషన్స్ పెట్టి.. గెలిచిన వారికి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు బహుమతులు అందించనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy