నేతన్నల ఆకలి చావులు లేకుండా చేస్తాం: సీఎం

KCR-Handloomనేత కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. మంత్రులు, అధికారులతో పాటు సిరిసిల్లనుంచి వచ్చిన 40మంది ప్రతినిధులతో మాట్టాడారు. నేత పరిశ్రమకు చెందిన ప్రతినిధులు చెప్పిన విషయాలను విన్న సీఎం.. వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. నెలకు 15వేల రూపాయలకు తక్కువ కాకుండా వేతనం బ్యాంకులో పడేలా ప్రణాళికలు రెడీ చేస్తామన్నారు.

ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నుంచి నేత కార్మికులు బయటపడాలన్నారు కేసీఆర్. సిరిసిల్ల, పోచంపల్లిలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే ప్రచారం పోయి.. నేతన్నలు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్నారనే మాట రావాలని ఆకాంక్షించారు. నేత కార్మికుల సంక్షేమం కోసం, నేత పరిశ్రమ అభివృద్ది కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సిఎం హామీ ఇచ్చారు. ఇందుకోసం రాబోయే బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని మాటిచ్చారు.

పోచంపల్లి, నారాయణపేట్, గద్వాల ప్రాంతంలో నేసే పట్టు, ఇక్కత్ చీరలకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. గతంలో పెళ్లి బట్టల కోసం కంచికి పోయే వారు ఇప్పుడు తెలంగాణ పల్లెల బాటపట్టడం గర్వంగా ఉందన్నారు. ఇలాంటి హస్తకళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

సిరిసిల్లతో పాటు రాష్ట్రంలోని నేత కార్మికులకు, నేత పరిశ్రమకు వరంగల్ టెక్స్ టైల్ పార్కుతో మహర్దశ పడుతుందని సిఎం అభిప్రాయపడ్డారు. సిరిసిల్ల పవర్ లూమ్స్ ను వరంగల్ టెక్స్ టైల్ పరిశ్రమకు అనుసంధానం చేస్తామన్నారు. పండుగల సందర్భంగా పేదలకు పంచే బట్టలతో పాటు, ప్రభుత్వం కొనుగోలు చేసే అన్ని రకాల వస్త్రాలను రాష్ట్రంలోని నేత పరిశ్రమ ద్వారానే కొనుగోలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అంతకుముందు నేత కార్మికులతో కలిసి సంహపంక్తి భోజనం చేశారు సీఎం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy