నేతన్నల కోసం రూ.1283 కోట్లు : కేటీఆర్

KTRతెలంగాణలోని నేతన్నల కోసం ఈ సంవత్సరం బడ్జెట్ లో రూ.1283 కోట్లు కేటాయించామన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. శనివారం (నవంబర్-18)న వరంగల్ లో ‘చేనేత మిత్ర’ పథకాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి..కానీ చేనేత కార్మికుల గురించి పట్టించుకోలేదన్నారు. పోచంపల్లిలో 800 మంది చేనేత కార్మికులు మరణించిన ఘటన కాంగ్రెస్ హయాంలోనే జరగటం సిగ్గుచేటు అన్నారు. నేత కార్మికల సమస్యల గురించి సీఎం కేసీఆర్ కు సంపూర్ణంగా తెలుసు అని తెలిపిన కేటీఆర్.. బట్టలు కూడా చేనేత ద్వారా కొనుగోలు చేసేందుకు విద్యాశాఖ, అంగన్ వాడి, కేసీఆర్ కిట్ చీరలు, బతుకమ్మ చీరలు లాంటి కార్యక్రమాలతో నేతన్నలకు చేతినిండా పని దొరుకుతుందన్నారు.

ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ..చేనేతల ప్రభుత్వం అన్నారు. సొసైటీలో ఉండే పెద్దలు గత ప్రభుత్వాల హయాంలో లెక్కల్లో గోల్ మాల్ చేశారని, చేనేత రంగానికి సంబంధంచి చాలా అన్నాయం జరిగిందన్నారు మంత్రి కేటీఆర్. చేనేత రంగానికి, పవర్లూమ్ వారికి వ్యక్తిగతంగా లక్ష రూపాయల రుణమాఫీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని స్పష్టం చేశారు మంత్రి. వృద్దాప్య నేతన్నల కోసం వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తున్నాం అన్నారు. నేతన్నకు చేయూత అనే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామని, దీంతో ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమని తెలిపియ ఆయన..సొసైటీ ఇబ్బందులుంటే నూలు, రసాయనాల మీద సబ్సిడీ ఇస్తున్నామన్నారు. ఈ సబ్సిడీ కూడా డైరెక్టుగా నేతన్నకే చేరాలనే గొప్ప కార్యక్రమమే నేతన్నకు చేయూత అని తెలిపారు.

చేనేత మిత్రతో 3 నుంచి 4 వేలు వేతనాలు పెరుగుతాయన్నారు. నేతన్నల వలసలు ఆగాలని, దీంతో కాకతీయ మెగా టెక్ట్స్ ప్రారంభించామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే మంచి కార్యక్రమాలకు సహకరించాలని, చిన్నచిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సవరించే సంపూర్ణమైన బాధ్యత తమ ప్రభుత్వానిదే అన్నారు. ప్రభుత్వ పనులకు ఒక్కపైసా కూడా లంచం ఇవ్వకూడదన్నారు. నేతన్నల కోసం తెలంగాణ నలువైపులా టెక్ట్స్ టైల్స్ ప్రారంభించనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్.  అంతకుముందు వరంగల్ లో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్ ఆమ్రపాలి, మేయర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy