నేతాజీ మిస్టీరియస్ హిస్టరీలో కొత్త మలుపు

netaji64 సీక్రెట్ ఫైళ్లను బయటపెట్టిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 

స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చుట్టూ అలుముకున్న మిస్టరీ వీడిపోయేలా కనిపిస్తోంది. ఆయన 1945 ఆగస్ట్ 18న తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారని ఇప్పటివరకు అంతా భావిస్తున్నారు. అయితే… కొందరు ఈ వాదనను ఖండిస్తుండగా… అసలు నిజం ఏమిటో ఇప్పటికీ సస్పెన్సే. బోస్ అదృశ్యానికి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలని డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తుండగా… ఈ మధ్య అది తీవ్రమైంది. దీంతో నేతాజీకి సంబంధించిన 12వేల పేజీలున్న 64 ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బయటపెట్టింది. చాలా ఏళ్లుగా ప్రభుత్వ, పోలీస్ లాకర్లలో నలిగిన ఫైళ్లను కోల్ కతా పోలీస్ మ్యూజియంలో పెట్టారు. సోమవారం నుంచి వాటిని చదివేందుకు ప్రజలను అనుమతించనున్నారు. ఈ ఫైళ్లను నేతాజీ కుటుంబసభ్యులు పరిశీలించారు. తర్వాత… పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఫైళ్లను చూశారు.

61442555680_625x300నేతాజీ పుట్టినరోజేంటో అందరికీ తెలుసు. కానీ… ఆయన మరణించినది ఎప్పుడో మాత్రం తెలియదు. ఇది చాలాబాధాకరమన్నారు మమతా బెనర్జీ. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ ఆర్కీవ్స్ లో ఉన్న నేతాజీ రిలేటెడ్ ఫైల్స్ అన్నింటిని భయపెట్టాలని మమత డిమాండ్ చేశారు. బోస్ కుటుంబసభ్యులు కూడా నేతాజీకి సంబంధించిన అన్ని ఫైళ్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే… స్వాతంత్రం వచ్చిన తర్వాత… బోస్ కుటుంబసభ్యులపై నిఘా పెట్టారని వచ్చిన వార్తలపై దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ఇక 1945 ఆగస్ట్ 18న నేతాజీ చనిపోలేదని మహాత్మ గాంధీ చెప్పినట్టు 1997లో ఓ సీక్రెట్ ఫైల్ వెలుగులోకి వచ్చింది. తాను రష్యాలో ఉన్నట్టు… ఇండియా వస్తానని నెహ్రూకు బోస్ లెటర్ రాశారు. ఇది తెలిసిన తర్వాతే… నేతాజీ చనిపోలేదని గాంధీ అన్నట్టుగా ఆ ఫైల్ లో ఉంది. అయితే నిజానిజాలేంటో… సోమవారం కొంతవరకు  బయటపడే అవకాశం ఉంది. నేషనల్ ఆర్కీవ్స్ లోని ఫైల్స్ బయటబయటకు వస్తే…బోస్ జీవితంపై  మరింత క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy