నేను కాకపోతే నయనతార

1ఓ క్యారెక్టర్ హిట్ అయితే ఆ మొత్తం క్రెడిట్ అంతా నాకే దక్కాలి అనుకుంటారు.. ఇక ఇండస్ట్రీలో అయితే నాకు నేనే.. ఇంకెవరూ చేయలేరు..  ఈ పాత్ర నా కోసమే పుట్టింది ఇలాంటి ఎన్నో డైలాగ్స్ పవర్ ఫుల్ గా బయటకు వస్తుంటాయి. ఎవరైనా మీరు కాకపోతే ఈ క్యారెక్టర్ ఇంకెవరు చేయగలరు అంటే.. ఇంకెవరూ లేరు అంటూ ఊదరగొట్టేస్తుంటారు.. కానీ అనుష్క మాత్రం ఇలా చెప్పలేదు.. నేను చేస్తున్న క్యారెక్టర్స్ మరొకరు కూడా చేయగలరని.. ఆ నటి యాక్టింగ్ నూ పొడిగేసింది. వేదంలోని వేశ్య పాత్ర కావొచ్చు.. బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో ఇలాంటి పాత్రలు నేను కాకపోతే నయనతారకు అవకాశాలు వచ్చేవని చెప్పుకొచ్చిదీ అమ్మడు. నయన్ కూడా సీతలాంటి పౌరాణిక పాత్రలో మెప్పించింది.. అంతేకాదు.. రొమాంటిక్, కాలేజీ గాళ్ ఇలా విభిన్న పాత్రల్లో నటించింది. నేను చేసే క్యారెక్టర్స్… నయనతారకు చేసే సత్తా ఉందంటూ కో స్టార్ ను పొడిడేసింది. ఓ తార.. మరో తారను మెచ్చుకోవటం ఇండస్ట్రీలోని ఆహ్లాదకరమైన వాతావరణానికి మచ్చు తునకగా చాలా గొప్పగా చెప్పుకొంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ…  దీనిపై నయనతార ఎలా రియాక్ట్ అవుతుంది.. అనుష్కను పొగిడేస్తుందా అని వేచిచూడాలి..

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy