నేను షారుఖ్ ఖాన్…తెలుగులో మాట్లాడిన బాద్ షా


బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నవంబ‌ర్ 2న.. అభిమానుల‌కి త‌న బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా జీరో సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేశాడు. అయితే ట్రైల‌ర్ రిలీజ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి విలేక‌రులు కూడా హాజ‌ర‌య్యారు. మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కి బ‌దులిచ్చిన షారూఖ్ , ఓ అభిమాని అందించిన వాచ్‌ని త‌న చేతికి ధ‌రించాడు. ప‌లువురు రిపోర్ట‌ర్స్ షారూఖ్‌ని సినిమా గురించి ప‌లు ప్ర‌శ్న‌లు అడుగుతుండ‌గా… హైద‌రాబాద్ కు చెందిన రిపోర్ట‌ర్ షారూఖ్‌తో తెలుగులో మాట్లాడించింది. షారుఖ్ తెలుగులో మాట్లాడటం ఆ కార్యక్రమానికి హాజరైన వాళ్లు కాసేపు నవ్వుకున్నారు. ముందుగా షారూఖ్‌ని ప్ర‌శ్నించే ముందు ఆ రిపోర్ట‌ర్ తాను హైద‌రాబాద్ రిపోర్ట‌ర్ అని చెప్పింది. ఇందుకు షారూఖ్ ..నువ్వు హైద‌రాబాదీవా అని ప్ర‌శ్నించాడు. మీకు తెలుగు వ‌చ్చా అని రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించగా… హా అన్నాడు. బాగున్నారా స‌ర్ అనే ప్ర‌శ్న‌కి .. ఆ బాగున్నా… బాగున్నా అంటూ న‌వ్వ‌డం మొద‌లు పెట్టేశాడు. ఆ తర్వాత కూడా నేను షారూఖ్ ఖాన్ అంటూ తెలుగులో చెప్పడానికి ప్రయత్నించి తాను చెప్పింది కరెక్టేనా అని ప్రశ్నించారు. దీంతో ‘జీరో’ టీమ్‌తో సహా మీడియా ప్రతినిధులు కూడా కాసేపు నవ్వుకున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy