నేనేమైనా చిల్లర దొంగనా..?

SASIKALAఅన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అసహనంతో ఊగిపోయారు. తానేమీ చిల్లర దొంగను కాదని.. జీపు ఎక్కనంటే ఎక్కనని భీష్మించారు. ఇదంతా పరప్పణ అగ్రహారం జైలులో జరిగింది.  అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహారం జైలుకు వెళ్లిన శశికళ అక్కడ పోలీసులపై చిందులు తొక్కారు. జైలులోకి ప్రయివేటు వాహనాలను, వ్యక్తిగత వాహనాలను అనుమతించరు. జైలు బయట నుంచి లోపలికి వెళ్లేందుకు దాదాపు ఒకటన్నర కిలోమీటర్ దూరం ఉంటుందట. దీంతో శశికళను గేటు దగ్గర నుంచి జైలు లోపలికి తీసుకెళ్లడానికి పోలీసు వాహనాన్ని ఏర్పాటు చేశారు. అందులోకి ఎక్కమని శశికళను కోరారు పోలీసులు. అయితే ఆ మాటతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయారట. తాను చిల్లరదొంగను కాదని పోలీసు జీపు ఎక్కడానికని చెప్పారట. ఎంతదూరం ఉన్నా తాను నడిచే వస్తానని అనడంతో జైలు అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారట. చివరకు నడుచుకూంటూనే చిన్నమ్మ జైలు వద్దకు చేరుకున్నారు. ఇదండి.. చిన్నమ్మ పట్టుదల.

2 Responses to నేనేమైనా చిల్లర దొంగనా..?

  1. Kar says:

    Chiara Donna kadhu notladonga

  2. Swarna sambaiah says:

    Common man think of it

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.