నేనే నెంబర్ వన్ : 100 బిలియన్‌ డాలర్ల కంపెనీగా TCS

TCSదేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌(TCS) సోమవారం(ఏప్రిల్-23) కొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే మెదటి 100 బిలియన్‌ డాలర్ల కంపెనీగా అవతరించింది. ఇది ఒక ప్రత్యేకమైన క్షణమని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో TCS మరింత దూసుకెళ్తుందని వాటాదారులను ఉద్దేశించి ఆయన అన్నారు.

ఇటీవల TCS  కంపెనీ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో శుక్రవారం నాటి షేర్‌ మార్కెట్లో కంపెనీ విలువ అమాంతం పెరిగిపోయింది. ఆ ఒక్కరోజే కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 40వేల కోట్లు పెరిగింది. దీంతో 100 బిలియన్‌ డాలర్ల మైలురాయిని చేరుకునేందుకు మరింత దగ్గరకు వచ్చిన TCS.. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో షేరు ధర పెరిగి దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి కంపెనీగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy